Breaking News

Fact Check: అర్హులకు పరిహారం జమచేస్తే నిందలా?

Published on Sat, 06/17/2023 - 05:08

‘సంక్షేమ ఫలాలు అందని అర్హులె­వరైనా ఉంటే వెతికి మరీ వారికి నేరుగా అందిస్తుంటే ఎవరైనా అభినందించాలిగానీ ఈనాడు మాత్రం పనిగట్టుకుని బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. వాస్తవాలు తెలుసుకోకుండా బటన్‌ నొక్కిన ఏడాదికి ఖాతాల్లో సొమ్ము అంటూ తప్పుడు కథనాన్ని వండివార్చింది’.. అంటూ వ్యవసాయ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో ఖండించింది. రైతులపై పైసా భారం పడకుండా నోటిఫైడ్‌ పంటలను సాగుచేసిన ప్రతీ ఎకరాకు డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి బీమా కల్పిస్తోంది. ఈ–క్రాప్‌లో నమోదు ప్రామాణికంగా ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. అర్హత పొందిన వారికి తరువాత ఏడాది సీజన్‌ ప్రారంభమయ్యే­లోగా పరిహారం చెల్లిస్తున్నారు. ఇలా గడిచిన నాలుగేళ్లుగా 44.66 లక్షల మందికి రూ.6,684.84 కోట్ల బీమా పరిహారం చెల్లించారు.

గతంలో ఎన్న­డూ లేని విధంగా ఖరీఫ్‌–2021 సీజన్‌లో అర్హత పొం­దిన 15.61 లక్షల మంది రైతులకు గతేడాది జూన్‌ 14న రూ.2,977.82 కోట్లు జమచేసింది. ఒక సీజన్‌కు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో పరి­హారం అందించడం చరిత్రలో ఇదే తొలిసారి. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు అర్హులైన ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే ఉద్దేశంతో పరిహారం అందని వారి నుంచి, ఆర్బీకేల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హత సాధిం­చిన మేరకు  ప్రభుత్వం నిధులు కూడా విడు­దల చేసింది. అయితే, కొన్ని సంశయాత్మక ఖాతా­లు­న్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పునఃపరిశీలన చేశారు.

అందులో అర్హత పొందిన వారికి సంబంధించిన విస్తీర్ణానికి గతంలో ఏమైనా చెల్లింపులు జరిగాయా లేదా అని కూడా పునఃపరిశీలన చేశారు. ఒకటి రెండుసార్లు క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన తర్వాత అన్ని వి«ధాలుగా అర్హత పొందిన వారి జాబి­తాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించారు. ఇలా అర్హత పొందిన 9 వేల మందికి ఈనెల 14న రూ.90 కోట్లు జమచేశారు. తొలుత అర్హత పొందిన వారిలో వీరు కేవలం 0.2 శాతం మాత్రమే. వాస్తవాలిలా ఉంటే.. సాంకేతిక కారణా­ల­తో ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన జాప్యాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుని బీమా పరిహారం ఏడాదికి జమచేసినట్లుగా వాస్తవాలను మరుగున పరిచేలా ప్రచురించిన వార్తను ఖండిస్తున్నట్లు వ్యవ­సాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు.   

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)