Breaking News

అధికారిక దోపిడీ

Published on Thu, 12/26/2024 - 05:53

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో కాఫీ ధరలకుస్థానికంగా నిర్ణయించిన ధరలకు పొంతన ఉండటం లేదు. పార్చిమెంట్, చెర్రీ కిలోకు రూ.వందకు పైగా వ్యత్యాసం ఉన్నందున భారీగా నష్టపోతున్నామని గిరి రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ జీసీసీ నిర్ణయించిన ధరలు తమను దోపిడీ చేసేలా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి,పాడేరు: కాఫీకి జాతీయ, అంతర్జాతీయస్థాయి మార్కెట్లో మంచి ధరలు ఉండటంతో ఈ ఏడాది అదేస్థాయిలో గిట్టుబాటు ధర కల్పించాలని అల్లూరి జిల్లా అధికార యంత్రాంగానికి గిరి రైతులు విన్నవించుకుంటున్నారు. బెంగళూరు మార్కెట్లో పార్చ్‌మెంట్‌ కాఫీ కిలో రూ.430 నుంచి రూ.450, అరిబికా చెర్రికి కూడా కిలో రూ.250 ధర ఉంది. చాలా దేశాల్లో కాఫీ దిగుబడులు తగ్గడంతో ఈ ఏడాది డిమాండ్‌ నెలకొంది. 

పార్చ్‌మెంట్‌ కాఫీ గింజల ధర మున్ముందు మరింత పెరిగు పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన్యంలో 1.50 వేల ఎకరాల్లో కాఫీ తోటలు ఉండగా సుమారు 17 వేల టన్నుల వరకు దిగుబడి వస్తోంది. కాఫీ రైతుల నుంచి కొనుగోళ్లకు ఐటీడీఏ, జీసీసీ కార్యాచరణ రూపొందించాయి. 

రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ముందుకువచ్చాయి. అయినప్పటికీ జాతీయస్థాయి మార్కెట్లో ధరలకు అనుగుణంగా తమకు చెల్లించడం లేదని గిరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
డిమాండ్‌ ఉన్నా..గిట్టుబాటు ధరలేక.. 
బెంగళూరు జాతీయ  మార్కెట్‌లో కాఫీ గింజలకు రికార్డు ధరలు ఉన్నప్పటికీ గిరిజన రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లేకపోతోంది.కాఫీ సీజన్‌కు ముందు జీసీసీ పార్చ్‌మెంట్‌ కాఫీ గింజలను కిలో రూ.285,అరబికా చెర్రి రూ.150 ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. అయితే బెంగళూరు మార్కెట్‌లో పార్చ్‌మెంట్‌ కాఫీ ధరలు కిలోకు రూ.400 దాటడంతో జీసీసీ అపెక్స్‌ కమిటీ కూడా ఏజెన్సీలో కొనుగోలు ధరలను కాస్త పెంచింది.

పార్చ్‌మెంట్‌ కిలో రూ.320, అరబికా చెర్రిని కిలో రూ.170, రొబస్టా చెర్రి కిలో రూ.100 ధరకు కొనుగోలు చేస్తామని జీసీసీ ప్రకటించింది. బెంగళూరు మార్కెట్లో ధరలకు జీసీసీ ప్రకటించిన ధరలకు పొంతన లేకపోవడంతో కాఫీ రైతులు మండి పడుతున్నారు. 

పార్చ్‌మెంట్‌ కాఫీ గింజలు రూ.450, అరబికా చెర్రి కిలో రూ.250 ధర ఉన్నందున అందుకు తగ్గట్టుగా  తమకు చెల్లించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. కనీసం పార్చ్‌మెంట్‌ కిలో రూ.420, చెర్రి కిలో రూ.200 ధరకు కొనుగోలు చేసేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.  

కాఫీ పండ్ల ధర అంతే.. 
పండ్ల దశలో కాఫీ పంటను అమ్ముకునే కాఫీ రైతులకు కూడా గిట్టుబాటు ధర కరువైంది. కిలో కాఫీ పండ్లను కిలో రూ.44ధరతో చింతపల్లి మాక్స్‌ సొసైటీ ద్వారా ఐటీడీఏ కొనుగోలు చేయిస్తోంది. బెంగళూరు మార్కెట్‌లో పెరిగిన ధరలు ప్రకారం చూసుకుంటే కిలో పండ్లకు కనీసం రూ.60ధర అయిన చెల్లించాల్సి ఉంది. 

అయితే ఐటీడీఏ మాత్రం ధరలు పెంచకపోవడంతో కాఫీ పండ్లను తక్కువ ధరకే అమ్ముకుంటూ కాఫీ రైతులు ఉసూరుమంటున్నారు. కొన్ని ప్రైవేట్‌ సంస్థలు మాత్రం కాఫీ పండ్లకు కిలో రూ.60 చెల్లిస్తున్నాయి. గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన ప్రభుత్వ యంత్రాంగంలోని జీసీసీ, ఐటీడీఏలు తక్కువ ధరలతో కాఫీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం అన్యాయమని కాఫీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాఫీ పండ్ల ధర పెంచాలి
కాఫీ పండ్లకు కూడా గిట్టుబాటు ధర కరువైంది. కిలో రూ.44తో చింతపల్లి మాక్స్‌ సంస్థ కొనుగోలు చేస్తుంది. ఈ తక్కువ ధరతో అమ్ముకుంటే నష్టమే మిగులుతుంది.కిలో రూ.70ధరతో కాఫీ పండ్లను ఐటీడీఏ కొనుగోలు చేయాలి. ఈ ఏడాది జాతీయ, అంతర్జాతీయస్థాయి మార్కెట్లో ధరలు బాగున్నాయి. అందుకు తగ్గట్టుగా ధరల చెల్లించేలా పాడేరు ఐటీడీఏ, గిరిజన సహకార సంస్థ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  – డిప్పల సురేష్ బాబు, కాఫీ రైతు, గుర్రగరువు, పాడేరు మండలం

అధికారులతో కమిటీ వేస్తాం
ఏజెన్సీలోని కాఫీపంట సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి న్యాయం చేస్తున్నాం.బెంగళూరు కాఫీ  మార్కెట్‌లో నాణ్యత ప్రకారం రోజువారి కాఫీ ఉత్పత్తుల ధరలపై సమీక్షించేందుకు అ«ధికారులతో కమిటీ వేస్తాం. కాఫీ రైతులు నష్టపోకుండా అపెక్స్‌ కమిటీ ఆమోదంతో జీసీసీ ఇప్పటికే ధరలను పెంచి కొనుగోలుకు ఏర్పాట్లు చేసింది. 

చింతపల్లి మాక్స్‌ సంస్థకు  కాఫీ పండ్లను అమ్ముకుంటున్న కాఫీ రైతులకు న్యాయం చేస్తాం. కాఫీ గింజల ఉత్పత్తి అనంతరం బహిరంగ మార్కెట్‌లో వేలం వేసి అమ్మకాల ద్వారా వచ్చే లాభాలను ఆయా కాఫీ రైతులకు బోనస్‌ రూపంలో చెల్లిస్తాం. – ఏఎస్‌ దినేష్ కుమార్, కలెక్టర్, పాడేరు 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)