Breaking News

వీర జవాన్‌కు సైనిక లాంఛనాలతో వీడ్కోలు 

Published on Fri, 09/29/2023 - 02:52

భట్టిప్రోలు: రాజస్తాన్‌లోని పాకిస్తాన్‌ బోర్డర్‌ జస్పల్‌మీర్‌ వద్ద విధి నిర్వహణలో మృతి చెందిన బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనకు చెందిన జ­వా­న్‌ పురమా గోపరాజు (26)కు గురువారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు ఘనంగా నిర్వహించా­రు. సోమవారం జస్పల్‌మీర్‌ వద్ద ప్రత్యేక కవాతు నిర్వహణలో భాగంగా రైఫ్లింగ్‌లో అకస్మాత్తుగా గోప­రాజు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.

పార్థివదేహాన్ని బుధవారం సాయంత్రం  స్వ­గ్రామమైన పల్లెకోనకు తీసుకొచ్చారు.  మృతదేహా­న్ని ప్రత్యేక వాహనంపై ఉంచి మిలటరీ అధికారు­లు, గ్రామస్తులు సైనిక లాంఛనాలతో భట్టిప్రోలు స్మశానవాటికకు తరలించారు. రెండు సెంట్లస్థలాన్ని రెవెన్యూ అధికారులు అమరజవాన్‌కు స్థూపం కట్టేందుకు  కేటాయించారు.

రాష్ట్ర సాంఘిక శాఖా మంత్రి డాక్టర్‌ మేరుగు నాగార్జున, బాపట్ల ఎంపీ నందిగం సురేష్తో పాటు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ శేరు శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్‌ బొల్లెద్దు రాజమ్మ ప్రతాప్‌ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. వీరి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి నాగార్జున, ఎంపీ నందిగం సురేష్‌ చెప్పారు. ఆర్మీ జవాన్లు అమర జవాన్‌కు గౌరవ వందనం నిర్వహించిన అనంతరం 21 రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి అంత్యక్రియలు నిర్వహించారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)