Breaking News

ఆక్సిజన్‌ అందక ఆగిన ఊపిరి..

Published on Sun, 08/10/2025 - 05:33

అనంతపురం మెడికల్‌: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఇటీవల వైద్యుల నిర్లక్ష్యంతో రాజేష్‌ (22), మధు నాయక్‌ (23) అనే యువకులు మృతి చెందిన ఘటనలు మరువకముందే,  మరో విషాదం చోటు చేసుకుంది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధుడు మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే, అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలోని గాందీనగర్‌కు చెందిన కృష్ణమూర్తి ఆచారి (75) ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో కుమారుడు రాంగోపాల ఆచారి శుక్రవారం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తీసుకువచ్చారు. 

ఆక్సిజన్‌ మీద ఉన్న కృష్ణమూర్తి ఆచారిని పరీక్షించిన వైద్యులు, సిటీ స్కాన్‌కు రెఫర్‌ చేశారు. కానీ ఆరోజు సిటీ స్కాన్‌ తీయించకుండా సిబ్బంది నిర్లక్ష్యం చేశారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆచారిని ఎటువంటి ఆక్సిజన్‌ సపోర్టు లేకుండానే ఎంఎన్‌ఓ కొల్లప్ప సిటీ స్కాన్‌కు తీసుకెళ్లాడు. సిటీ స్కాన్‌ కోసం వచ్చిన ఆచారిని దాదాపు గంటన్నర పాటు ఆ విభాగం ముందే ఉంచేశారు. 

సిఫార్సులతో వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో ఆక్సిజన్‌ అందక కృష్ణమూర్తి ఆచారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.  సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆత్మారాం, అడ్మినిస్ట్రేటర్‌ మల్లికార్జున రెడ్డి వైఫల్యంతోనే రోగులకందే వైద్యంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్న విమర్శలు రావడం గమనార్హం.   

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)