Breaking News

నకిలీ మద్యం గుట్టురట్టు

Published on Thu, 09/04/2025 - 05:26

పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అవలింగిలో వైన్‌షాపు సమీపంలోని ఓ ఇంట్లో 205 లీటర్ల నకిలీ మద్యం, 172 ఖాళీ మద్యం బాటిళ్లు, ప్రింటింగ్‌ మెషిన్‌ను ఎక్సైజ్‌ పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ డి.శ్రీకాంత్‌రెడ్డి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. అవలింగిలోని వైన్‌షాపును జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పి.మురళీధర్, సీఐ కె.కృష్ణా­రావు బుధవారం తనిఖీ చేశారు. 

ఆ సమయంలో పలాస మండలం కోసంగిపురం గ్రామానికి చెందిన తంగుడు మణికంఠ, కోటబొమ్మాళి గ్రామా­నికి చెందిన సదునుపల్లి సుందరరావు వాటర్‌ బాటిళ్లలో మద్యం అమ్ముతున్నట్టు గుర్తించారు. అనుమానం వచ్చి పరిశీలించగా 8 నకిలీ మద్యం బాటిళ్లు, అనుమానాస్పదంగా ఉన్న మరో 172 మద్యం బాటిళ్లను గుర్తించారు. ఇవెక్కడివని ప్రశ్నిం­ంచగా సకలాభక్తుల నీలకంఠం, పిట్టా పైడిరాజు, షాపు నౌకనామాదారుడు కలిసి విక్రయించమన్నా­రని తెలిపారు. 

అనంతరం షాపునకు 100 మీటర్ల దూరంలో ఓ ఇంట్లో తనిఖీ చేయగా నకిలీ మద్యం బాటిళ్లు, తేదీ, బ్యాచ్‌ నంబర్లు తయారు చేసే ప్రింటింగ్‌ మెషిన్, ఖాళీ మద్యం బాటిళ్లు, మూతలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తంగుడు మణికంఠ, సదునుపల్లి సుందరరావులను అరెస్ట్‌ చేశారు. నీలకంఠం, పైడిరాజు పరారీలో ఉన్నారు. వీరందరిపైనా కేసులు నమోదు చేశామని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. 

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)