Breaking News

Fact Check: ఏమిటీ తప్పుడు రాతలు?

Published on Sat, 12/30/2023 - 04:29

సాక్షి, అమరావతి: ప్రజలకు ఏమాత్రం మంచి జరుగుతున్నా చూడలేకపోతోంది ఈనాడు. ముఖ్యంగా రైతు­లకు మేలు చేస్తుంటే అసలు తట్టుకోలేకపోతోంది ఆ పచ్చ పత్రిక. అందులోను ఆక్వా రంగానికి విద్యుత్‌ ఎంత ప్రధానమో తెలిసి కూడా ఆ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్థల ద్వారా చేస్తున్న మేలుకు తప్పుడు రాతల ద్వారా అడ్డుపడుతోంది.

అందులో భాగంగానే ‘విద్యుత్‌ ఇంజనీర్లే విస్తుపోయేలా’ అంటూ కనీస అవగాహన లేకుండా ఓ అబద్ధపు వార్తను శుక్రవారం వండి వార్చింది. గతంలో ధరలకు ప్రస్తుత ధరలకు భారీ వ్యత్యాసం ఉందని, లేబర్‌ చార్జీలు మెటీరియల్‌ చార్జీలకంటే ఎక్కువ చూపించారని, ఏపీఈఆర్‌సీ అనుమతి కూడా తీసుకోలేదని చేతికొచ్చిన అసత్యాలు అచ్చేసింది. ఈ కుట్రపూరిత కథనాన్ని ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీసీపీడీసీఎల్‌) తీవ్రంగా తప్పుబట్టింది. ఈ కథనంలో తప్పుల్ని ఆ సంస్థ సీఎండీ కె.సంతోష్‌రావు ‘సాక్షి’కి వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు వాస్తవాలు ఇలా ఉన్నాయి.  

► పశ్చిమగోదావరి జిల్లా 220/33 కేవీ అకివీడు సబ్‌స్టేషన్‌ నుంచి కృష్ణాజిల్లా 33/11 కేవీ పోతు­మర్రు సబ్‌స్టేషన్‌కి అనుసంధానం చేస్తూ విద్యుత్‌ లైన్లు వేయాలని గతంలోనే ఏపీసీపీడీసీఎల్‌ ప్రతిపాదించింది. ఈ సబ్‌స్టేషన్‌ పరిధిలో సుమా­రు 976 ఆక్వారంగ సంబంధిత పరిశ్రమలున్నా­యి.

ఇవి నెలకు 30 లక్షల యూనిట్ల విద్యుత్‌ వినియోగిస్తున్నాయి. ఈ సర్విసులకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ అందించడానికి ఈ అనుసంధానం తప్పదని డిస్కం భావించింది. ఈ ఇంటర్‌ లింకింగ్‌ లైన్‌ గతంలో ప్రతిపాదించినప్పటికి ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) నుంచి విద్యుత్‌ సరఫరాకి కావలసిన అనుమతుల్లో జాప్యం కారణంగా ఈ ప్రతిపాదనలు ముందుకు వెళ్లలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ పవ­ర్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ (ఏపీ ట్రాన్స్‌కో) అ­ను­మతులు రావడంతో పనుల్లో కదలిక వచ్చింది.  

► 132/33 కేవీ చిగురుకోట సబ్‌స్టేషన్‌ నుంచి వెలువడే 33 కేవీ పోతుమర్రు ఫీడర్‌పై 33/11 కేవీ పోతుమర్రు సబ్‌స్టేషన్‌కు ఫీడ్‌ చేస్తున్నారు. ఇదే ఫీడర్‌పై 33/11 కేవీ పోతుమర్రు సబ్‌స్టేషన్, 33/11 కేవీ మూలలంక సబ్‌స్టేషన్‌ కూడా అనుసంధానమై ఉన్నాయి. దీంతో ఈ ఫీడర్‌ 20 మెగావాట్ల కంటే ఎక్కువ లోడును నమోదు చేస్తోంది.

వేసవి కాలంలో అధిక లోడ్‌ కారణంగా లోడ్‌ రి­లీఫ్‌ (ఎల్‌ఆర్‌) విధించాల్సి వస్తోంది. అదీకాకుండా ఈ రెండు సబ్‌స్టేషన్లు ప్రధానంగా ఆక్వాకు విద్యుత్‌ను అందిస్తున్నాయి. 33/11 కేవీ పోతుమర్రు సబ్‌స్టేషన్‌పై 950కి పైగానే  ఆక్వా సర్విసులున్నాయి. ఈ రెండు సబ్‌స్టేషన్లకు 33 కేవీ ప్రత్యామ్నాయ సరఫరా లేదు. అలాగే 132/33 కేవీ చిగురుకోటపై లోడ్‌ గరిష్టంగా 124 మెగావాట్లుగా నమోదైంది. ఈ ప్రాంతంలో లోడ్‌ పెరుగుదల సంవత్సరానికి 25 నుంచి 30 శాతంగా ఉంది. అందువల్ల 220/33 కేవీ ఆకివీడు నుంచి కొత్త లైను ఏర్పాటు చేయడం అనివార్యమైంది.  

► రెండేళ్ల కిందట ఈ ఇంటర్‌ లింకింగ్‌ లైన్‌ సిమెం­ట్‌ పోల్స్‌తో ప్రతిపాదనలు తయారు చేశారు. ఇ­ప్పడు మిచాంగ్‌ తుపాను ప్రభావాన్ని దృష్టిలో పె­ట్టుకోవడంతోపాటు, సముద్రతీర ప్రాంతానికి ద­గ్గరగా ఉండడం వలన 33 కేవీ లైన్లు ఎం+ రూ­పంలో ఉండే మెటల్‌ టవర్స్‌ను ప్రతిపాదించా­రు. వీటివల్ల చెట్లు విరిగినా లైన్లకు ఎటువంటి స­మస్య కలగదు. విద్యుత్‌ సరఫరాలో అంతరా­యం ఉండదు. ఈ టవర్స్‌ చాలాకాలం మన్నిక­గా ఉంటాయి. ఉప్పుటేరు కెనాల్‌ను పరిగణలోకి తీసుకుని అధికారులు ఈ ప్రతిపాదనలు చేశారు.  

► సిమెంట్‌ పోల్స్‌కి సంబంధించి లేబర్‌ ప్రతిపాదనలు వేరుగా, ప్రతి ఎం+ టవర్‌కి సంబంధించి లేబర్‌ కాస్ట్, టవర్స్‌ మెటీరియల్‌ కాస్ట్‌ కలిపి ప్రతిపాదించడం వలన ఈ రెండు ప్రతిపాదనల మధ్య అంచనాల్లో వ్యత్యాసం ఉంటుంది. ఈ ప్రతిపాదనలు లేటెస్ట్‌ స్టాండర్డ్‌ షెడ్యూల్‌ ఆఫ్‌ రేట్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) డేటా ప్రకారం తయారుచేసి టెండర్‌ పిలవడం జరిగింది. సిస్టమ్‌ అప్లికేషన్స్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌ (ఎస్‌ఏపీ)లో ప్రతిపాదనలు చేయడం వల్ల లేబర్‌ కాస్ట్‌కి సంబంధించి ఎటువంటి దాపరికాలకు ఆస్కారం లేదు.  

► యథార్థాలు తెలుసుకోకుండా ఈనాడు పత్రిక వార్తలు ప్రచురించడం సరైన పద్ధతి కాదు. ఈనాడు వార్తను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆక్వా రంగానికి నిరంతరాయ విద్యుత్‌ చాలా ముఖ్యం. ఏమాత్రం కోతలున్నా.. ఆక్సిజన్‌ అందక రొయ్యలు చనిపోతాయి. ఆక్వా రైతులకు భారీనష్టం వాటిల్లుతుంది. అలాంటి పరిస్థితి వారికి రాకుండా చేసేందుకు చేపడుతున్న ప్రాజెక్టుపై ప్రజలు, రైతుల్లో లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేసిన ఈనాడు ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయాలి.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)