Breaking News

తిరుమల తిరుపతి దేవస్థానాల సౌకర్యాలు భేష్‌

Published on Wed, 02/21/2024 - 05:23

తిరుమల/న్యూఢిల్లీ: శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుంచి విచ్చేస్తోన్న భక్తులకు శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాలు, గదులు తదితర సౌకర్యాలను టీటీడీ చక్కగా కల్పిస్తోందని బ్రిజ్‌లాల్‌ అధ్యక్షతన ఉన్న భారత హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ అభినందించింది.

కమిటీ సభ్యులు మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులతో సమావేశమయ్యారు. టీటీడీ ఆవిర్భావం నుంచి చేపడుతోన్న సామాజిక, ధార్మిక, సంక్షేమ కార్యకలాపాలను 40 నిమిషాల ఆడియో విజువల్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి వివరించారు.

కమిటీ చైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ పద్ధతులు, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు, విపత్తుల నిర్వహణ ప్రణాళికలను ప్రశంసించారు. కమిటీ సభ్యులు బిప్లవ్‌ కుమార్‌ దేవ్, నీరజ్‌ శేఖర్, దిలీప్‌ ఘోష్, దులాల్‌ చంద్ర గోస్వామి, రాజా అమరేశ్వర నాయక్, డాక్టర్‌ సత్య పాల్‌ సింగ్, డాక్టర్‌ నిషికాంత్‌ దూబే, హోం వ్యవహారాల శాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు. 

టీటీడీ ట్రస్టులకు రూ.43 లక్షల విరాళం 
బెంగళూరుకు చెందిన యాక్సిస్‌ హెల్త్‌ కేర్‌ సర్విసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ వ్యవస్థాపకుడు వర్ధమాన్‌ జైన్‌ టీటీడీలోని పలు ట్రస్టులకు రూ.43 లక్షలు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో విరాళం డీడీలను టీటీడీ ఈవోకు దాత అందజేశారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.33 లక్షల 33 వేలు, ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షల11 వేలు అందించారు.

తిరుపతి పరిశుభ్రతపై కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రశంస  
తిరుపతి నగరం పారిశు«ధ్యంలో మ­రింత నిబద్ధత పాటిస్తుందని కేంద్ర గృహ, పట్ట­ణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. తడి–పొడి చెత్త ద్వారా సేకరించిన వ్యర్థాల­ను ప్రాసెసింగ్, నిర్వహణ సౌకర్యాల కోసం శాస్త్రీ­యంగా ప్రాసెసింగ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. స్వచ్ఛభారత్‌ మిషన్, కేంద్ర గృహ, పట్టణ వ్య­వ­హారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జన­వరి 11న తిరుపతి నగరానికి స్వచ్ఛ సర్వేక్షణ్‌ అ­వార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ అ­వా­ర్డు అందుకున్న అనంతరం పారిశుద్ధ్యానికి సంబంధించి తిరుపతి నగరం పాటిస్తోన్న నిబద్ధతను కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది.

పారిశుధ్య సేవలను మరింతగా విస్తరించేందు­కు, సిటీని ది బెస్ట్‌ క్లీన్‌సిటీగా తీర్చిదిద్దేందు­కు 1,000 మంది కార్మికులను నియమించింది. ఇక్కడ ఏర్పా టు చేసిన వికేంద్రీకృత వ్యర్థాల ప్రాసెసింగ్‌.. కేంద్రీకృత ప్లాంట్లపై భారాన్ని తగ్గిస్తుందని, వాటి పనిభారం, రవాణా ఖర్చులను కూ­డా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపింది. గణనీయ పరిమాణంలో సేంద్రీయ వ్యర్థాలు ఉత్పన్నమయ్యే మార్కెట్‌­లు, తోటల్లో తడి వ్యర్థాలను ప్రాసెస్‌ చేయడంపై దృష్టి సారించిందని వెల్లడించింది. 3 ప్రధాన మార్కె­ట్లు, 3 తోటల వద్ద 6 వికేంద్రీకృత వ్యర్థాల ప్రా­సెసింగ్‌ సౌకర్యాలు ఉన్నట్లు తెలిపింది.

నగరంలో 3 వేర్వేరు ప్రదేశాల్లో 3 బయో చెస్ట్‌ యంత్రాలను ఏర్పాటు చేసి రోజు­కు 100 కిలోల­కు పైగా ఉత్పత్తి చేసే 27 బల్క్‌ వేస్ట్‌ జనరేటర్ల­ను, రోజుకు 50–100 కిలోలు ఉత్పత్తి చేసే 60 జనరేటర్లను గుర్తించి వర్గీకరించినట్లు పేర్కొంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను ప్రత్యేకమైన రీతిలో రీసైక్లింగ్‌ చేయడానికి వాషింగ్‌ ప్లాంట్, ఆగ్లోమెరేటర్‌ మిషన్‌ (ధన మెషినరీ)ని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ మిషనరీ వల్ల తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్‌ బృందం ఏడాది కాలంలో 263.29 టన్నుల ప్లాస్టిక్‌ గ్రాన్యూల్స్‌ను విక్రయించేలా తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్‌ కృషి చేసి­నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ కొనియాడింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)