Breaking News

హాస్టల్‌ విద్యార్థులకూ ఫేస్‌ రికగ్నిషన్‌!

Published on Tue, 11/05/2024 - 05:10

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఫేస్‌ రికగ్నిషన్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) పద్ధతిని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీన్లో భాగంగా తొలిదశలో ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాకు రెండు హాస్టళ్లను ఎంపిక చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,100 బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉంటే వాటిలో 52 హాస్టళ్లలో ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలుకు పైలెట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టనుంది వాటికి సంబంధించిన ఎంపిక ప్రక్రియను కూడా పూర్తిచేసిన బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఆ వివరాలను ప్రభు­త్వానికి నివేదించారు.

ప్రభుత్వం వారం రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుని సర్వీస్‌ ప్రొవైడర్‌కు అప్పగించేలా చర్యలు తీసుకోనున్నట్లు  సమాచారం. ఎఫ్‌­ఆర్‌­ఎస్‌ అమలు కోసం ప్రత్యేకంగా రూ­పొం­దించిన యాప్‌ను ఆయా వసతి గృహాలకు చెందిన హాస్టల్‌ సంక్షేమ అధికారి (హెచ్‌డబ్ల్యూఓ)కి అప్పగించనున్నారు. ఎంపిక చేసిన ప్రతి హాస్టల్‌కు చెందిన విద్యార్థుల ఫొటోలు తీసి, ఆథార్, ఫోన్‌ నంబర్, చిరునామా, తరగతి తదితర వివరాలను ఆయా యాప్‌ల్లో అప్‌లోడ్‌ చేస్తారు.

తద్వారా యాప్‌ ఉన్న మొబైల్‌ ఫోన్, పరికరాల్లోనూ విద్యార్థి ముఖం చూపిస్తే హాజరు పడుతుంది. ఇలా ఉదయం ప్రార్థన, సాయంత్రం స్కూల్‌ సమయం తర్వాత ఎఫ్‌ఆర్‌ఎస్‌లో హాజరు సేకరిస్తారు. తద్వారా ఏఏ వసతి గృహాల్లో ఏ రోజు ఎంత మంది విద్యార్థులు ఉన్నారు? మిగిలిన వాళ్లు ఎందుకు రాలేదు? తదితర హాజరు సంబంధ సమాచారంతోపాటు, హాస్టల్‌ సంక్షేమ అధికారుల అలసత్వాన్ని, నిర్వహణ లోపాలపై తదుపరి చర్యలు తీసుకునే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)