Breaking News

సర్కారు మెప్పు కోసం.. విద్యార్థులకు ముప్పు!

Published on Sun, 03/30/2025 - 05:19

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో అధికారులు కొత్త విధానాలను అనుసరిస్తున్నారు. ప్రభుత్వం మెప్పు కోసం వేగంగా ఫలితాలు వెల్లడించేందుకు రికార్డు సమయంలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక లెక్చరర్‌తో పరిమితికి మించి బుక్‌లెట్లు వేల్యుయేషన్‌ చేయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో మూల్యాంకనం షెడ్యూల్‌ను కూడా అధికారులు కుదించారు. 

 మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు మూల్యాంకనం షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ఖరారు చేసింది. అయితే, రెండుసార్లు ఈ షెడ్యూల్‌ను మార్చేసి ఏప్రిల్‌ 3 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని తాజాగా ఆదేశించినట్టు సమాచారం. ఆ తక్కువ సమయంలో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశామన్న గొప్ప కోసం... ఏదైనా పొరపాటు జరిగి మార్కులు తప్పుగా నమోదైతే విద్యార్థుల జీవితాలు నాశనమవుతాయనే విషయాన్ని విస్మరించారనే విమ
ర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఇంటర్‌లో లిమిట్‌ 30.. టార్గెట్‌ 45 జవాబు పత్రాలు
ఇంటర్మీడియెట్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఈ నెల 7న ప్రారంభించారు. మొదటి పరీక్షగా నిర్వహించిన సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం ఆ రోజే పూర్తి చేశారు. ఇంగ్లిష్‌తోపాటు ఇతర పరీక్షల పేపర్ల మూల్యాంకనం ఈ నెల 17న ప్రారంభించి విడతల వారీగా ఏప్రిల్‌ 8 నాటికి పూర్తి చేయాలని తొలుత షెడ్యూల్‌ నిర్ణయించారు. కానీ, తర్వాత తుది గడువును ఏప్రిల్‌ 5కి మార్చారు. తాజాగా 3వ తేదీకి కుదించినట్టు అధ్యాపకులు చెబుతున్నారు. మూల్యాంకనంలో రోజుకు ఒక ఎగ్జామినర్‌ (లెక్చరర్‌) ఉదయం 15, మధ్యాహ్నం 15... మొత్తం 30 జవాబు పత్రాలనే దిద్దాలనేది నిబంధన. 

ఇలా చేస్తే ఎక్కడా పొరపాట్లు జరిగే అవకాశం ఉండదు. కానీ, ఈసారి 30 జవాబు పత్రాలే దిద్దాలని చెప్పినా... ఎగ్జామినర్లపై ఒత్తిడి తెచ్చి అదనంగా మరో 15 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయిస్తున్నారు. ఫలితాలు త్వరగా ఇవ్వాలనే ఉద్దేశంతో నిబంధనలకు తూట్లు పొడిచి విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం కలిగేలా ఎక్కువ పేపర్లు దిద్దించడంపై లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఒత్తిడిలో జవాబు పత్రాల్లో మార్కులు తప్పుగా నమోదై ఒక్క పేపర్‌ తప్పినా విద్యార్థికి తీవ్ర నష్టం కలుగుతుందని చెబుతున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)