Breaking News

సామాజిక హితం

Published on Sat, 12/23/2023 - 06:06

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత మూడేళ్లుగా అభివృద్ధి వ్యయం పెరుగుతుండగా వడ్డీల చెల్లింపుల వ్యయం తగ్గుతున్నట్లు రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) అధ్యయన నివేదిక వెల్లడించింది. రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్లపై నివేదిక విడు­దల చేసిన ఆర్బీఐ 2021–22 నుంచి 2023–24 వరకు ప్రధాన ఆర్థిక సూచికలను ఇందులో పొందుపరిచింది. సామా­జిక సేవలు, ఆర్థిక సేవల వ్యయం రాష్ట్ర ఆర్థికా­భివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొంది. సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలపై నేరుగా చేసే వ్యయాన్ని అభివృద్ధి వ్యయంగా నిర్వచించింది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యపై చేసే ఖర్చును అభివృద్ధి వ్యయంగా ఉదహరించింది. 

జీతభత్యాలు భారీగానే..
► ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మూడేళ్లుగా సామాజిక రంగ వ్యయం పెరుగుతోంది. సామాజిక సేవలు, గ్రామీణాభివృద్ధి, ఆహార నిల్వలు, గిడ్డంగులు ఈ కోవలోకి వస్తాయి. ఇదే సమయంలో ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగాల కోసం వెచ్చించే వ్యయం కూడా పెరుగుతోంది. 

►  2021–22లో మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయం రూ.1.19 లక్షల కోట్లు ఉండగా 2023–24 నాటికి రూ.1.92 లక్షల కోట్లకు పెరిగింది. 

► వడ్డీ చెల్లింపులు పెరుగుతున్నాయనే వాదనల్లో నిజం లేదు. రెవెన్యూ రాబడిలో వడ్డీ చెల్లింపుల శాతం తగ్గుతోంది. 

► ఏపీలో వేతనాలు, జీతాలు చెల్లింపులు గత ఐదేళ్లుగా పెరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగులకు పీఆర్‌సీ అమలుతో పాటు చిరు ఉద్యోగుల వేతనాలను పెంచడంతో వేతనాలు, జీతాల వ్యయం పెరుగుతున్నట్లు సూచికలు వెల్లడిస్తున్నాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)