Breaking News

నీట్‌ యూజీలో కీలక మార్పు

Published on Sun, 01/26/2025 - 05:24

సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ, ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌)–యూజీ పరీక్ష విధానంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) కీలక మార్పులు చేసింది. కరోనా సమయంలో ప్రవేశపెట్టిన.. ప్రశ్నలను ఎంపిక చేసుకునే విధానంతో పాటు అదనపు సమయం కేటాయింపునకు ఎన్టీఏ స్వస్తి పలికింది. నీట్‌ యూ­జీ–2025 పరీక్ష 180 ప్రశ్నలతోనే ఉంటుందని శనివారం ఒక ప్రకటనలో ఎన్టీఏ వెల్లడించింది. ఫిజిక్స్, కెమిస్ట్రీలో 45 చొప్పున, బయాలజీ(బోటనీ, జువాలజీ)లో 90 ప్రశ్నలు ఉంటాయని స్పష్టం చేసింది.

ఈ 180 ప్రశ్నలకు విద్యార్థులు 180(మూడు గంటలు) నిమిషాల్లో జవాబులు రాయాల్సి ఉంటుంది. 2021–22 విద్యా సంవత్సరంలో నిర్వహించిన నీట్‌లో ప్రశ్నలను ఎంపిక చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి సబ్జెక్ట్‌నూ సెక్షన్‌–ఏ, బీ అని రెండు భాగాలుగా విభజించారు. సెక్షన్‌–ఏలోని అన్ని ప్రశ్నలకు.. బీలో 15కు గాను 10 ప్రశ్నలకు జవాబులు ఇచ్చేలా వెసులుబాటు కల్పించారు. దీంతో 200 ప్రశ్నలతో ప్రశ్నాపత్రం ఉండేది. అదనంగా 20 ప్రశ్నలను చేర్చడంతో విద్యార్థులకు 20 నిమిషాల అదనపు సమయం కూడా ఇచ్చారు. ఎన్టీఏ తాజా నిర్ణయంతో ఇకపై సెక్షన్‌–బీ విధానం ఉండదు. అదనంగా 20 ప్రశ్నలను ప్రవేశపెట్టడంతో విద్యార్థులు 200 ప్రశ్నలు చదివి.. సరైన వాటిని గుర్తించాల్సి వచ్చేది. ఈ విధానం నష్టాన్ని కూడా కలగజేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)