Breaking News

మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత

Published on Tue, 05/28/2024 - 05:46

కైకలూరు: మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి (74) సోమవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె సోమవారం గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండూరు ఆమె స్వగ్రామం. ముదినేపల్లి నియోజకవర్గం నుంచి 1983లో టీడీపీ తరఫున పోటీ చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ ఉద్దండుడిగా పేరొందిన పిన్నమనేని కోటేశ్వరరావుపై పోటీ చేసి ఓటమి చెందారు. తిరిగి ముదినేపల్లి నుంచి 1985లో కోనేరు రంగారావుపై విజయం సాధించారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 19 89లో ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా ఆమెకు అవకాశం కల్పించారు.

ఆ సమయంలో పరీక్ష పేపర్‌ లీక్‌ అంశం వివాదాస్పదమైంది. యెర్నేని సీతాదేవి మంత్రిగా ఉన్నప్పుడే మొదటిసారి ఇన్‌స్టెంట్, బెటర్‌మెంట్‌ పరీక్షలు ప్రవేశపెట్టారు.  1994లో పిన్నమనేని కోటేశ్వరరావు కుమారుడు వెంకటేశ్వరరావుపై పోటీ చేసి విజయం సాధించారు.  1999, 2004 ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు.  2004 తర్వాత జిల్లా ల పునరి్వభజనలో భాగంగా ముదినేపల్లి నియోజకవర్గం రద్దయి.. కైకలూరు నియోజకవర్గంలో కలి సింది.

సీతాదేవి టీటీడీ బోర్డు సభ్యురాలుగా పనిచేశారు. 2013లో బీజేపీలో చేరారు. బీజేపీలో మహి ళా మోర్చా నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యురాలిగా బా ధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం విజయ మిల్క్‌ డెయిరీ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. సీతాదేవి భర్త యెర్నేని నాగేంద్రనాథ్‌ (చిట్టిబాబు) రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన గతేడాది అనారోగ్యంతో మరణించారు.  సీతాదేవి పార్థివదేహాన్ని సొంతూ రు కొండూరుకు తీసుకొచ్చారు.పలువురు నేతలు  భౌతికకాయాన్ని సందర్శించి నివాళులరి్పంచారు.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)