Breaking News

బడి వేళల పెంపునకు కసరత్తు

Published on Mon, 11/18/2024 - 05:45

సాక్షి, అమరావతి/కదిరి: ఉన్నత పాఠశాలల పనివేళల్ని మరో గంట పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాయంత్రం 4 గంటల వరకు నడుస్తున్న వీటిని 5 గంటల వరకు నిర్వహించాలని భావిస్తోంది. గతంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండే పనివేళలను గత ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మార్చింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో రోజుకు 7 పీరియడ్స్‌ ఉండేవి. 

ఇకమీదట ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు 8 పిరియడ్‌ల్లో హైస్కూల్‌ నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీన్ని తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా నెల్లూరు జిల్లాలో అమలు చేయాలని, ఆ జిల్లాలోని ప్రతి మండలంలో ఒక ఉన్నత పాఠశాల­ను ఎంపిక చేయాలని ఈ నెల 16న  ప్ర­భు­త్వం ఉత్తర్వులిచ్చింది. ఎంపిక చేసిన పాఠశాలల జాబితాను ఈ నెల 20లోగా తెలియజేయాలని ఆదేశించింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ నెల 25 నుంచి 30 వరకు కొత్త టైం టేబుల్‌ ప్రకారం తరగతులు నిర్వహిస్తారు. 

ఇది సక్సెస్‌ అయిందని ప్రభుత్వం భావిస్తే వెంటనే ఈ విద్యా సంవ­త్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అ­మ­లు చేయాలని యో­చి­స్తోంది. కాగా, పాఠశాలల పనివేళల పెంపు తలకు మించిన భారంగా మారుతుందని..విద్యా­శాఖ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం (అపస్‌) అధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ పేర్కొన్నారు. 

అలాగే, ప్రభుత్వ పాఠశాలల సమయాన్ని మార్చాలన్న నిర్ణయం సరైంది కాదని ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (పీఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్‌­రెడ్డి, ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత సమయాలు పిల్లల  సైకాలజీకి అనుగుణంగా ఉన్నాయని, మార్చాల్సిన అవసరం లేదని తెలిపారు. 
 
ప్రతిపాదిత టైం టేబుల్‌ ఇలా..
» ఉదయం 9కి మొ­దటి గంట, 9.05కు రెండో­గంట, 9.05 నుంచి 9.25 వరకు ప్రార్థన. 
»  9.25–10.15 వరకు మొద­టి పీరియడ్, 10.15–11 వరకు రెండో పిరియడ్‌. 
»  11–11.15 వరకు విరామం. 
»  11.15 నుంచి మధ్యాహ్నం 12 వరకు మూడో పిరియడ్, 12–12.45 వరకు నాలుగో పీరియడ్‌...12.45–1.45 వరకు భోజన విరామం. 
»   1.45–2.30 వరకు ఐదో పీరి­యడ్, 2.30–3.15 వరకు ఆరో పీరియడ్‌. 3.15–3.30 వరకు చిన్న విరామం. 
»  3.30–4.15 వరకు ఏడో పీరియడ్, 4.15–5 గంటల వరకు 8వ పీరియడ్‌. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)