Breaking News

బుడతడు.. గుండె ఆగినంత పనిచేశాడు..

Published on Wed, 03/08/2023 - 04:21

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఓ చిన్నారి ఆడుకుంటూ తల్లి స్నానానికి వెళ్లిన రూమ్‌కు బయట గడియ పెట్టేశాడు. ఆ తర్వాత ఆడుకుంటూ బాల్కనీలోని గ్రిల్స్‌లో కాలు పెట్టగా అది ఇరుక్కుపోయి గుక్కపట్టి ఏడ్వడం మొదలు పెట్టాడు. బాత్‌రూమ్‌లో ఉన్న తల్లికి బయట ఏం జరిగిందో తెలియక గుండె ఆగినంత పని అయ్యింది. రెండు మూడు గంటల ఉత్కంఠకు ఫైర్‌ సిబ్బంది రాకతో తెరపడింది. వివరాల్లోకి వెళితే... రాజమహేంద్రవరం ప్రకాశ్‌నగర్‌లోని సాయిరాఘవ టవర్స్‌ మూడో అంతస్తులో ఎం.సంతోషలక్ష్మి కుటుంబ సభ్యులు ఉంటున్నారు.

ఆమెకు ఏడాదిన్నర బాబు (సాయిరామ్‌) ఉన్నాడు. మంగళవారం ఉదయం సాయిరామ్‌ను తీసుకుని తల్లి బాత్‌రూమ్‌కు వెళ్లింది. ఎప్పటిలా స్నానం చేయించి రూమ్‌ బయటకు వదిలింది. తర్వాత తానూ స్నానానికి ఉపక్రమించింది. ఇంతలో ఆ బాలుడు బాత్‌రూమ్‌ డోర్‌ వద్ద ఆడుకుంటూ గడియ పెట్టేశాడు. అక్కడి నుంచి నెమ్మదిగా బాల్కనీలోకి వచ్చాడు. బాల్కనీలోని  గ్రిల్‌లో కాలు పెట్టగా ఇరుక్కుపోయింది. కాలు బయటకు రాకపోయేసరికి గుక్కపట్టి ఏడ్వడం మొదలు పెట్టాడు. బాబు ఏడుపు బాత్‌రూమ్‌ నుంచి విన్న తల్లి బయటకు రాలేక, బాబుకు ఏం జరిగిందో తెలియక తీవ్ర ఆందోళన చెందింది. ఏం చేయాలో తెలియక గట్టిగా కేకలు వేసింది. కింది భాగంలో నివాసం ఉంటున్న వారు విని పైకి వచ్చారు.

లోపలికి వెళ్దామంటే మెయిన్‌ డోర్‌ వేసి ఉంది. లోపల ఏం జరుగుతుందో అర్థంకాని అయోమయ పరిస్థితి. దీంతో వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అపార్టుమెంటుకు చేరుకుని నిచ్చెన ద్వారా పైకి ఎక్కి బాల్కనీలోని గ్రిల్స్‌లో ఇరుక్కున్న బాలుడి కాలు బయటకు తీశారు. తర్వాత లోనికి వెళ్లి బాత్‌రూమ్‌ గడియ తీయడంతో తల్లి సంతోషలక్ష్మి బయటకు వచ్చింది. ఇద్దరూ క్షేమంగానే ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫైర్‌ సిబ్బందిని స్థానికులు అభినందించారు.
 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)