Breaking News

ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే పోటీ చేయను

Published on Tue, 10/15/2024 - 03:44

ప్రొద్దుటూరు క్రైం : 2029లో బ్యాలెట్‌ పేపర్‌తో కాకుండా ఈవీఎంల ద్వారా ఎన్నికలను నిర్వహిస్తే పోటీ చేయ­నని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. పోటీ చేసినా ఫలితం ఉండదని, 2024లో మోసం చేసినట్టుగానే 2029 ఫలితాల్లోనూ మోసం జరుగుతుందని చెప్పారు. బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించినప్పుడే స్వచ్ఛమైన ప్రజా తీర్పు తెలుస్తుందని చెప్పారు. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

నాలుగు నెలల కిందట జరిగిన ఏపీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చింది ప్రజలు కాదని, ఈవీఎం మిషన్‌లే శాసనం చేశాయని కౌంటింగ్‌ అయిన అరగంటకే ప్రజలు ముక్తకంఠంతో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘మేము ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే ఆ ఓట్లన్నీ ఎక్కడికి పోయాయి’ అంటూ రాష్ట్ర ప్రజలంతా అయోమయంగా ప్రశ్నించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అప్పటికీ వైఎస్సార్‌సీపీ అధిష్టానంగానీ, అభ్యర్థులుగానీ ఫలితాలపై నోరు మెదపలేదన్నారు.

దీనిపై ఎందరు అనుమానం వ్యక్త చేసినా కేంద్ర ఎన్నికల సంఘంలో ఉలుకూ పలుకూ లేదన్నారు. తమ అనుమానాలను నివృత్తి చేయాలని పోటీ చేసిన అభ్యర్థులు కోరినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రజల్లో ఈవీఎంలపై ఉన్న అనుమానాలను సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నివృత్తి చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తే ప్రజల తీర్పు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, టెక్నాలజీని ఉపయోగించుకుని అప్రజాస్వామిక వి«ధానంలో నాయకులు ఎన్నికవుతుంటారని ఆందోళన వ్యక్తం చేశారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)