Breaking News

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

Published on Fri, 05/31/2024 - 05:24

సాక్షి, మచిలీపట్నం: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జూన్‌ 4న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌­కు­మార్‌ మీనా తెలిపారు. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు, ఏజెంట్లు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి గురువారం వచ్చిన ఆయన కృష్ణా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. 

అక్కడ ఈవీ­ఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూములు.. భద్రత, కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడ చేసిన, చేయనున్న ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ ఆస్మిలను అడిగి తెలు­సు­కున్నారు. నియోజకవర్గాల వారిగా లెక్కింపు కేంద్రాలు, టెబుళ్లు, రౌండ్ల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామ­న్నారు. 

లెక్కింపు సమయంలో అభ్యర్థి లేదా వారి ఏజెంట్‌ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిని కౌంటింగ్‌ హాల్‌ నుండి బయటకు పంపేస్తామన్నారు. కౌంటింగ్‌ రోజున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ముఖేష్‌కుమార్‌ మీనా అధికారులకు సూచించారు. 

పోస్టల్‌ బ్యాలెట్ల అంశం సీఈసీ పరిధిలో ఉంది..
పోస్టల్‌ బ్యాలెట్లపై వైఎస్సార్‌సీపీ చేసిన విన్నపాన్ని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లామని, అది సీఈసీ పరిధిలో ఉందని ముఖేష్‌­కు­మార్‌ మీనా వెల్లడించారు. నేడో, రేపో  దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందన్నారు. 

ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్, గన్నవరం రిటర్నింగ్‌ అధికారి గీతాంజలి శర్మ, డీఆర్‌ఓ కె.చంద్రశేఖరరావు, పలువురు రిటర్నింగ్‌ అధికారులు, పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారి షాహిద్‌ బాబు, సర్వే ల్యాండ్‌ రికార్డుల ఏడీ మనీషా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)