Breaking News

హైవేల పక్కనే ఈవీ స్టేషన్లు

Published on Mon, 12/09/2024 - 05:43

జాతీయ రహదారులను ఆనుకుని ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు  నెలకొల్పే ప్రణాళికను వేగవంతం చేయాలని జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ(ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ‘ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రమోషన్‌ స్కీమ్‌–2024’ కార్యక్రమం కింద వాటిని ఏర్పాటు చేయనుంది. 

ఇందుకోసం దేశంలో విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించే దిశగా మౌలిక సదుపాయాల వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రెండు పెట్రోలియం కంపెనీల భాగస్వామ్యంతో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికను ఆమోదించారు.      – సాక్షి, అమరావతి 

దేశంలో జాతీయ రహదారులను ఆనుకుని మొత్తం 7,432 ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఇందుకోసం భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం కంపెనీలతో కలసి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ పెట్రోలియం కంపెనీలకు రూ.800 కోట్లు సబ్సిడీగా ఇచ్చేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం తెలిపింది. 

మొదటి దశలో 5,833 ఈవీ స్టేషన్లు ఏర్పాటుకు ఎన్‌హెచ్‌ఏఐ కార్యాచరణకు ఉపక్రమించింది. రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు.   

ఎంపిక చేసిన జాతీయ రహ­దారులను ఆనుకుని ప్రతి 50 కి.మీ.కు ఒకటి చొప్పున ఈవీ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తారు.

వచ్చే ఏడాది జూన్‌ నాటికి ఈవీ స్టేషన్ల­ను ఏర్పాటు చేయా­లన్నదే లక్ష్యం.

దేశంలో ఏర్పాటు చేయనున్న మొత్తం ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు  7,432

మొదటి దశలోఏర్పాటు చేయనున్న ఈవీ స్టేషన్లు 5,833 

మన రాష్ట్రంలో మొదటి దశలో చెన్నై– కోల్‌కతా జాతీయ రహదారిలో ఏర్పాటు చేసే స్టేషన్లు 230  

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)