Breaking News

పేదల ఇళ్లపై ప్రేమంటే ఇదే.. తొలి ఇల్లు అందుకున్న ఈపూరి జీవరత్నం

Published on Mon, 07/24/2023 - 10:49

సాక్షి, గుంటూరు:  పేదరికంపై యుద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆ సమరంలో పెత్తందారులనే శత్రువులు ఎన్ని ఆంటకాలు కల్పిస్తున్నా మొక్కవోని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో.. అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి నేడు(సోమవారం) శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో పర్యటించి.. సీఆర్డీఏ జోన్‌లో పేదల ఇళ్ల కోసం చేపట్టిన నిర్మాణాలకు స్వయంగా భూమి పూజ నిర్వహించి.. తొలి ఇంటి పట్టా పత్రాలను అందించారు. 

సీఆర్డీఏలో పూర్తైన తొలి ఇల్లు  కృష్ణాయపాలెంకు చెందిన ఈపూరి జీవరత్నందే. చంద్రబాబు హయాంలో రెండుసార్లు దరఖాస్తు చేసుకున్న సొంతింటి కల నెరవేరలేదట. కానీ, సీఎం జగన్‌ హయంలో ఒక్కసారి దరఖాస్తు చేయగానే కేటాయించారని చెబుతున్నారామె. జీవరత్నం భర్త వ్యవసాయ కూలీ. పేద కుటుంబానికి చెందిన ఈమె వాలంటీర్‌ కూడా. ఆమె పిల్లలకు అమ్మ ఒడి కింద సాయం.. పొదుపు సంఘంలో ఉన్న ఈమెకు నాలుగు విడతల్లో రూ. 10వేల చొప్పున రుణమాఫీ కూడా జరిగింది. అయితే.. తన పుట్టింటి వాళ్లు కూడా జగనన్నలా ఆలోచించలేదని అంటున్నారామె. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా..  ఒక అన్నలా(సీఎం జగన్‌ను ​ఉద్దేశించి..) లక్షల రూపాయల విలువ చేసే ఆస్తి అందించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారామె. 


తన మెడలోని కండువా తీసి లబ్ధిదారుల కూతురి మెడలో కప్పిన సీఎం జగన్‌

జీవితాంతం రుణపడి ఉంటా
లేఅవుట్‌లో తొలుత నాకు కేటాయించిన స్థలంలో మోడల్‌ హౌస్‌ నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. సెంటు స్థలంలో ఇల్లు బాగా వచ్చింది. ఇల్లు కట్టుకోవడమే కలగా మిగిలిపోతుందని అనుకున్నా. కానీ, జగనన్న స్థలం ఇవ్వడమే కాక ఇల్లు కట్టించి నా కలను సాకారం చేశాడు. సెంటు స్థలంలో ఇల్లు ఎలా వస్తుందని అన్న వారు దీనిని చూడాలి. సొంతింటి కల సాకారం చేసిన సీఎం జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం.
:::ఈపూరి జీవరత్నం, కృష్ణాయపాలెం  

అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందన్న పెత్తందారుల వితండ వాదాలకు.. యెల్లో మీడియా వత్తాసు పలుకుతోంది. పైగా ఒకవైపు కార్యక్రమం జరుగుతున్న సమయంలోనూ ‘పేదల ఇళ్లపై ప్రేమంటే ఇదేనా?’ అంటూ విషం చిమ్ముతోంది. కానీ, వాటన్నింటికి చెక్‌ పెడుతూ నిరుపేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేసింది. 

ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం పండుగలా సాగుతోంది. సొంతింటి కల నెరవేరుతుండడంతో.. బస్సుల్లో కృష్ణాయపాలెంకు తరలివచ్చిన లబ్ధిదారులు.. అంతకు ముందు దివంగత మహానేత వైఎస్సార్‌, జననేత వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)