Breaking News

ఇంగ్లిషే నంబర్‌ వన్‌

Published on Tue, 12/10/2024 - 04:24

‘ఇంగ్లిష్‌ భాషలో ప్రావీణ్యం ఉంటే ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అంతర్జాతీయంగా ఎక్కువ మందితో కనెక్ట్‌ అయ్యేందుకు అవకాశం ఉండటంతో ఇంగ్లిష్‌కే మా ప్రాధాన్యం’ అంటోంది వర్తమాన ప్రపంచం. ఏకంగా 135 దేశాల్లోని వారంతా ఇంగ్లిష్‌ భాషకే అగ్రస్థానం ఇస్తున్నారని  ‘డ్యూలింగో లాంగ్వేజ్‌ నివేదిక–2024’ వెల్లడించింది.

అందుకే ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు అభ్యసిస్తున్న భాషల్లో ఇంగ్లిష్‌ మొదటి స్థానంలో కొనసాగుతోందని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ప్రముఖ ఎడ్యుకేషన్‌ యాప్‌గా గుర్తింపు పొందిన డ్యూలింగో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల అభ్యాసనంపై తాజా నివేదిక  విడుదల చేసింది. రెండో స్థానంలో స్పానిష్‌ , మూడో స్థానంలో ఫ్రెంచ్‌ ఉన్నాయని తెలిపింది. డ్యూలింగో లాంగ్వేజ్‌ 
నివేదిక–2024లోని ప్రధానాంశాలివీ..  – సాక్షి, అమరావతి

ప్రపంచంలో అత్యధికులు అభ్యసిస్తున్న భాష
⇒ ప్రపంచంలో అత్యధికులు అభ్యసిస్తున్న భాషగా ఇంగ్లిష్‌ మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. 2023 కంటే 2024లో ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లిష్‌కు మొదటి స్థానం ఇచి్చన దేశాలు 10 శాతం పెరిగాయి. 2024లో 135 దేశాలు ఇంగ్లిష్‌కు మొదటి ప్రాధాన్యమిచ్చాయి.  

⇒   మలేíÙయా, అల్బేనియా, మోనాకో, ఇరాన్, మంగోలియా, ఎరిత్రియా, రువాండా దేశాల్లో గత ఏడాది 
రెండో స్థానంలో ఉన్న ఇంగ్లిష్‌ ఈ ఏడాది మొదటి స్థానానికి చేరుకుంది. కాగా.. శ్రీలంక, మయన్మార్, క్రొయేషియా, ఇథియోపియా, కిరిబతి, మలావి దేశాల్లో గత ఏడాది మూడో స్థానంలో ఉన్న ఇంగ్లిష్‌ ఈ ఏడాది మొదటి స్థానానికి చేరుకుంది. ప్రపంచంలో అత్యధిక దేశాల్లో ప్రజలు తమ మాతృభాషతోపాటు ఇంగ్లిష్‌ కూడా నేర్చుకుంటున్నారు.

⇒ప్రపంచంలో అత్యున్నత విద్యా సంస్థల్లో చేరేందుకు ఇంగ్లిష్‌ సరి్టఫికేషన్‌ కోర్సు చేస్తున్న వారి సంఖ్య కూడా అమాంతం పెరుగుతోంది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరేందుకు ఇంగ్లిష్‌ సర్టిఫికేషన్‌ కోర్సుకు ప్రాధాన్యమిస్తున్న దేశాల్లో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. తరువాత స్థానాల్లో చైనా, కెనడా, బ్రెజిల్, ఇండోనేషియా ఉన్నాయి.   
⇒ అత్యధికులు అభ్యసిస్తున్న భాషల్లో హిందీ పదో స్థానంలో ఉంది. 
 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)