Breaking News

అభివృద్ధి పథంలో ఇంధన రంగం

Published on Mon, 05/29/2023 - 05:10

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఇంధన రంగం అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ తెలిపారు. వార్షిక ఇంధన వినియోగం 2017–18లో 50,077 మిలియన్‌ యూనిట్లతో పోలిస్తే 2022–23లో 65,830 మిలియన్‌ యూనిట్లకు చేరుకోవడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.

భవిష్యత్‌ ప్రణాళికలపై విద్యుత్‌ సంస్థలతో ఆయన ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే.. విద్యుత్‌ వినియోగం దాదాపు 31.45 శాతానికి పెరిగిందని, ఇటీవల రోజుకు 251 మిలియన్‌ యూనిట్లు ఆల్‌ టైమ్‌ హై ఎనర్జీ డిమాండ్‌ రాగా విద్యుత్‌ సంస్థలు విజయవంతంగా తీర్చాయని చెప్పారు. 

 ఒప్పందాలతో ఉజ్వల భవిష్యత్‌
ఈ ఏడాది మార్చి నెలలో విశాఖలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగం పెట్టుబడులతో దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని విజయానంద్‌ వెల్లడించారు. ఈ 42 అవగాహన ఒప్పందాలను అమలు చేయాల్సిన అవసరం విద్యుత్‌ సంస్థలపై ఉందన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే అత్యంత అనుకూల రాష్ట్రంగా ఏపీని ప్రభుత్వం మార్చిందన్నారు.

విండ్‌ సోలార్‌ హైబ్రిడ్‌ ప్రాజెక్టులను స్థాపించడానికి ప్రభుత్వం ఇప్పటికే పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020ని ప్రకటించిందని తెలిపారు. పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్ట్‌లు (పీఎస్‌పీ) పూర్తయితే విద్యుత్‌ రంగంలో దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌గా మారి మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి  చేస్తుందన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వినియోగదారులకు నమ్మకమైన విద్యుత్‌ను అందించాలని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించాలని పదే పదే చెబుతున్నారన్నారు. వ్యవసాయానికి 9 గంటలు పగటిపూట ఉచిత విద్యుత్‌ను వచ్చే 25 ఏళ్ల పాటు కొనసాగించేందుకు 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈసీఐ)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. 

 రాష్ట్ర గ్రిడ్‌ కు 105 మిలియన్‌ యూనిట్లు
జెన్‌కో ఎండీ కేవీఎన్‌ చక్రధర్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర గ్రిడ్‌కు రోజుకు 102 నుంచి 105 మిలియన్‌ యూనిట్లను జెన్‌కో సరఫరా చేస్తోందని, ఇది మొత్తం ఇంధన డిమాండ్‌లో 40 నుండి 45 శాతం ఉందని తెలిపారు.

రాష్ట్ర విభజన తర్వాత ఇదే అత్యధికమని, బొగ్గు నిల్వలను మెరుగుపరచడానికి కూడా జెన్‌కో అన్ని ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. సమావేశంలో  ట్రాన్స్‌కో జేఎండీ బి.మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు, ఏపీ ఎస్‌ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి, ట్రాన్స్‌కో డైరెక్టర్లు ఏవీకే భాస్కర్, టి.వీరభద్రారెడ్డి పాల్గొన్నారు.

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు