Breaking News

పోలవరం నిర్వాసితులకు పునరావాసంలో అంతులేని నిర్లక్ష్యం

Published on Sat, 08/23/2025 - 03:44

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ మండిపడింది. సకాలంలో పునరావాసం కల్పించకపోతే నిర్వాసితుల జీవితాలు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. జీవనోపాధిని పెంచేలా నిర్వాసితులకు పునరావాసం కల్పించడాన్ని అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలని సిఫార్సు చేస్తూ పార్లమెంట్‌కు ఇటీవల స్టాండింగ్‌ కమిటీ నివేదిక ఇచ్చింది. 

జలవనరుల విభాగంపై ఎంపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ అధ్యక్షతన ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ.. ఈ ఏడాది జూన్‌ 8 నుంచి 11 వరకు పోలవరం ప్రాజెక్టు పనులు, పునరావాసం కల్పనను క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. దీనిపై పార్లమెంట్‌కు నివేదిక ఇచ్చింది.   

12,797 కుటుంబాలకే పునరావాసం 
పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తే 1,06,006 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇందుకోసం 213 పునరావాస కాలనీల్లో ఇళ్లు నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. కానీ, 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా.. పోలవరం ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్దేశించింది. వరదలు, సాంకేతిక సమస్యలు వస్తే.. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మరో ఏడాది గడువు పొడిగించింది. ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. 

ఈ ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేస్తే 38,060 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. కానీ, జనవరి 8 నాటికి కేవలం 12,797 కుటుంబాలకే పునరావాసం కల్పించారని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నివేదికలో ఎత్తిచూపింది. తక్షణమే నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. పోలవరం నిర్మాణం, నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను సమన్వయం చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. 

పనులను పర్యవేక్షిస్తున్న అధికారులకు వెంటనే ప్రాజెక్టు వద్ద క్వార్టర్స్‌ నిరి్మంచాలని సిఫార్సు చేసింది. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేలా పనులను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి కమిటీని నియమించాలని సిఫార్సు చేసింది. పోలవరం ప్రాజెక్టు వద్ద ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి కల్పించవచ్చని అభిప్రాయపడింది.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)