నకిలీ అని తెలుసు.. అయినా రిజిస్టర్‌ చేయ్‌

Published on Sun, 07/12/2026 - 05:28

మదనపల్లె టౌన్‌: నకిలీ దస్తావేజులు, ఫోర్జరీ సర్టిఫికెట్లతో రూ.50 కోట్ల విలువైన భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో కొందరు భూ కబ్జాకోరులు విశ్వ ప్రయత్నాలు చేశారు. భూ రిజిస్ట్రేషన్‌కు నిరాకరించిన సబ్‌ రిజిస్ట్రార్ను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ... బెదిరింపులకు దిగారు. స్థానిక జనసేన నాయకుడు బాలగణేష్‌ (45)సహా బాల సరస్వతమ్మ (69), వెంగళ ఉమానరేష్‌ (47).. మదనపల్లె సబ్‌ రిజిస్ట్రార్ ఎం.గురుస్వామి వద్దకు శుక్రవారం వచ్చారు. బండమీదకమ్మపల్లి గ్రామంలోని సర్వే నెంబర్‌ 303/1లో గల రూ.కోట్ల విలువైన భూమికి సంబంధించిన విక్రయ దస్తావేజు, స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీని రిజి్రస్టేషన్‌ చేయాలన్నారు. 

సబ్‌ రిజిస్ట్రార్ ఆ దస్తావేజులను ఆఫీసు రికార్డులతో సరిపోల్చగా, పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్లు తేలింది. ఈసీ పరిశీలనలోనూ ఇదే స్పష్టమయ్యింది.  నింది­తులు జతపరిచిన 08–12–2017 నాటి ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌ మీసేవ పోర్టల్‌ ద్వారా పరిశీలించగా అది నకిలీదని తేలింది. ఈ ఆస్తికి అసలైన యజమానులు ఎన్‌.రవీంద్రనాథ్, ఆయన భార్య అని, తన వద్దకు వచ్చిన ముగ్గురు వ్యక్తులకు సదరు ఆస్తిపై ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేవని తేలింది.  అసలైన భూమి యజమానులను మోసగించి ఆస్తిని కాజేసేందుకే ఈ నకిలీ పత్రాలు సృష్టించినట్లు సబ్‌ రిజిస్ట్రార్ గుర్తించి.. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం తగదని ముగ్గురినీ హెచ్చరించారు. 

ఈ సందర్భంలో  నిందితులు ఉమానరేష్, బాల గణేష్ లు సబ్‌ రిజిస్ట్రార్ను తీవ్రంగా బెదిరించారు. ‘ఇది నకిలీ దస్తావేజే అని మాకూ తెలుసు.. రిజిస్టర్‌ చేసేయ్‌. మిగతాది మేము చూసుకుంటాం. లేదంటే నిన్ను కిడ్నాప్‌ చేస్తాం.  ఉద్యోగం నుంచి తీయించేస్తాం. ప్రతిరోజూ సంబంధిత ఉన్నతాధికారులకు తప్పుడు ఫిర్యాదులు పంపి, డిపార్ట్‌మెంటల్‌ ఎంక్వైరీలు వేయించి ఆత్మహత్య చేసుకునేలా చేస్తాం’ అంటూ వేధించారు. అంతటితో ఆగకుండా, సబ్‌ రిజిస్ట్రార్ ద్వారా రూ.100 కోట్ల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందంటూ జిల్లా కలెక్టర్‌కు వాట్సాప్‌ చేయడమే కాకుండా... సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు.  

తీవ్ర మానసిక ఆందోళనకు గురైన సబ్‌ రిజిస్ట్రార్‌ పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై మదనపల్లె వన్‌టౌన్‌ సీఐ రాజారెడ్డి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల్లో ఏ–2గా ఉన్న ఉమానరేష్ ను శనివారం అరెస్టు చేశారు.   ఏ–1 బాల సరస్వతి, ఏ–3 బాలగణేష్‌ పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నామని ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించేందుకు సహకరించిన సాక్షులు, ఇతరులను కూడా అరెస్ట్‌ చేస్తామని చెప్పారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)