Breaking News

అట్లుంటయ్‌.. చింతమనేని వేధింపులు

Published on Fri, 08/23/2024 - 06:09

సాక్షి ప్రతినిధి, ఏలూరు: అధికారులు, ఉద్యోగు­లపై టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వేధింపులకు ఇదో మచ్చుతునక. ఏలూరు జిల్లావ్యాప్తంగా 63 మంది పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు రాగా 57 మంది కొత్త స్థానాల్లో చేరారు. తన నియోజకవర్గానికి చెందిన మిగిలిన ఆరుగురి పదోన్నతికి మాత్రం చింతమనేని మోకాలడ్డు పెడుతున్నారు. ఆ ఆరు­గురిని టార్గెట్‌ చేసి వారిని రిలీవ్‌ చేయడానికి వీల్లేదంటూ ఉన్నతాధికారులకు అధికారపార్టీ ఎమ్మెల్యే హుకుం జారీచేశారు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 

మరో 3 రోజులు జాప్యం జరిగితే వచ్చిన పదోన్నతులు దక్కకపోగా స్థానికంగా తీవ్ర అవమానాలు, భౌతిక దాడులు భరిస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏలూరు జిల్లాలో ఈనెల 8న 63 మంది గ్రేడ్‌–3 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్‌–2 పదోన్నతి దక్కింది. పదోన్నతి ఉత్తర్వులు జారీ అయిన రోజు నుంచి 15 రోజుల్లోగా కొత్త స్థానంలో విధుల్లో చేరాల్సి ఉంటుంది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో పదోన్నతుల వ్యవహారం సజావుగా సాగింది. దెందులూరు నియోజకవర్గంలో పరిస్థితి భిన్నంగా ఉంది. 

ఇక్కడ 12 మందికి పదోన్నతి దక్కితే ఆరుగురు నానా తంటాలు పడి గత వారంలో రిలీవ్‌ అయి కొత్త స్థానంలో విధుల్లో చేరారు. మిగిలిన ఆరుగురిని మాత్రం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ టార్గెట్‌ చేశారు. గతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వ్యవహరించారని, స్థానిక నేతలతో సన్నిహితంగా ఉన్నారని, ఇలా రకరకాల ముద్రలు వేసి ఆ ఆరు­గురు పదోన్నతులు అడ్డుకున్నారు. తనకు చెప్ప­కుండా వారిని రిలీవ్‌ చేయడానికి వీల్లేదని జిల్లా పంచాయతీ అధికారికి ఆయన ఆదేశించారు. దీంతో ఆ ఆరుగురి భవితవ్యం గాలిలో ఉంది. 

రెడ్‌బుక్‌ రాజకీయాలు
దెందులూరు మండలంలో రామారావుగూడె, పెదవేగి మండలంలోని విజయరాయి, నడి­పల్లి, భోగాపురం, జగన్నాథపురం, ఏలూ­రు రూరల్‌ మండలంలో మల్కాపురం పంచా­యతీ కార్యదర్శులను వేధిస్తూ ఎమ్మెల్యే రెడ్‌­బుక్‌ రాజకీయాలకు తెరతీశారు. కక్ష సాధింపు­లతో నిరంతరం అవమానాలకు గురిచే­యడంతో పాటు మాటలతోనూ వేధిస్తున్నా­రు. వీరి­లో ఒక పంచాయతీ కార్యదర్శిపై కొద్ది­రోజుల క్రితం జరిగిన సమావేశంలో 40 నిమిషాల పాటు బహిరంగ వేదికపైనే తీవ్ర­స్థాయిలో చింతమనేని విరుచుకుపడ్డారు.

ప్రొటోకాల్‌ పాటించ­లేదనే కారణంతో సదరు కార్యదర్శిని సస్పెండ్‌ చేయాలని డీపీఓను ఆదేశించడంతో డీపీఓ ఆగమేఘాలపై సస్పెన్షన్‌కు ఫైల్‌ రెడీ చేశారు. మరో పంచాయతీ కార్యదర్శి రిలీవ్‌ కోసం ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లగా ఎ­మ్మెల్యే  ముఖ్య అనుచరుడు ఆ కార్యదర్శిని మందలించి మరీ పంపినట్లు సమాచారం. 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)