Breaking News

వృద్ధాశ్రమంపై ఏలూరు ఎమ్మెల్యే దాష్టీకం

Published on Wed, 01/29/2025 - 06:50

సాక్షి ప్రతినిధి, ఏలూరు:  రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వేధింపుల పర్వం తారాస్థాయిలో కొనసాగుతోంది. ఓ వృద్ధాశ్రమం నిర్వాహకులపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుడంటూ ముద్ర వేసి అధికారంలోకి వచ్చిన రోజు నుంచీ వేధింపుల తీవ్రత పెంచారు. చివరకు ఆశ్రమం బిల్లులు నగరపాలక సంస్థ నుంచి మంజూరుకాకుండా అడ్డుకోవడంతో పాటు మంగళవారం స్టోర్‌ రూమ్, మేనేజర్‌ రూమ్‌కు అధికారులతో సీల్‌ వేయించి వృద్ధులను వెళ్లిపోవాల్సిందిగా హుకుం జారీ చేయడం పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. 

వివరాల్లోకి వెళితే..  ఏలూరు నగరంలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి సోదరుడు బడేటి బుజ్జి హయాంలో 2017లో నగరపాలక సంస్థ పరిధిలో మెప్మా ద్వారా ‘నిశ్చింత పట్టణ నిరాశ్రయుల సేవా కేంద్రం’ను నగరంలోని పత్తేబాదలో ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ బాధ్యతను మదర్‌ థెరిస్సా ఫౌండేషన్‌కు అప్పగించి నిర్వహణ కోసం ప్రతి నెలా రూ.50 వేలు నగరపాలక సంస్థ నుంచి మంజూరు చేస్తున్నారు. 

ప్రస్తుతం ఆశ్రమంలో 48 మంది వృద్ధులున్నారు. వీరికి పూర్తిగా రెండు పూటలా ఆహారం, వసతితో పాటు వైద్యసేవలన్నీ మదర్‌థెరిస్సా ఫౌండేషన్‌ నిర్వాహకులే ఉచితంగా చూస్తున్నారు. 2017 నుంచి ఈ కేంద్రం కొనసాగుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా యథాతథంగా ఇబ్బంది లేకుండా కొనసాగించారు. 

ఈ క్రమంలో 2024లో టీడీపీ ఎమ్మెల్యేగా ఏలూరు నుంచి బడేటి చంటి గెలుపొందారు. దీంతో ఆశ్రమంపై వేధింపుల పర్వం తారాస్థాయికి చేరింది. నగరపాలక సంస్థ కూడా ప్రతి నెలా బిల్లులు ఇవ్వకుండా ఏడాదికి రూ.6 లక్షలు చొప్పున ఒకేసారి బిల్లులు మంజూరు చేసింది. అలా మూడేళ్ల నుంచి రూ.18 లక్షల మొత్తం మదర్‌థెరిస్సా ఫౌండేషన్‌ నిర్వాహకులు రాయి మంగరాజుకు, రాయి విమలాదేవికి రావాల్సి ఉంది.  

వైఎస్సార్‌సీపీ పేరుతో వేధింపులు 
మదర్‌థెరిస్సా ఫౌండేషన్‌ నిర్వాహకురాలు రాయి విమలాదేవి 37వ డివిజన్‌ నుంచి గతంలో టీడీపీ నుంచి గెలుపొంది కార్పొరేటర్‌గా పనిచేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే సోదరుడు, అప్పటి టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆశ్రమ బాధ్యతలను నగరపాలక సంస్థ ద్వారా అధికారికంగా అప్పజెప్పారు. 

2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని సమక్షంలో విమలాదేవి, ఆమె కుమారుడు పార్టీలో చేరారు. ఎక్కడా క్రియాశీలకంగా లేకుండా పూర్తిగా ఆశ్రమ సేవా కార్యక్రమాలకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నిర్వాహకులను ఎమ్మెల్యే ముప్పుతిప్పలు పెడుతున్నారు. గతేడాది జూన్‌లో మంజూరైన బిల్లును నగరపాలక సంస్థలో నిలుపుదల చేయించి అప్పటి నుంచి వేధిస్తూనే ఉన్నారు. 

వేధింపులకు పరాకాష్టగా మంగళవారం ఎలాంటి నోటీసులు, ముందస్తు సమాచారం లేకుండా నగరపాలక సంస్థ అధికారి కృష్ణమూర్తి, సిబ్బంది, త్రీటౌన్‌ పోలీసుల సహకారంతో ఆశ్రమానికి వచ్చి స్టోర్‌రూమ్, మేనేజర్‌ రూమ్‌కు సీల్‌ వేసి వృద్ధులను బయటికి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు.  మరోవైపు ఇదే ఆశ్రమ నిర్వహణ బాధ్యతను నగరపాలక సంస్థ ద్వారా మరొకరికి అప్పగించడం గమనార్హం.

ఆత్మహత్యే శరణ్యం..  
రూ.18 లక్షలు మంజూరైనా బిల్లు ఇవ్వకుండా వేధించడంతో పాటు ఆకస్మాత్తుగా ఖాళీ చేసి వెళ్లిపోండి అంటున్నారు. మొదటి నుంచీ టీడీపీలోనే ఉన్నాం. నా  భార్య టీడీపీ కార్పొరేటర్‌గా కూడా పనిచేశారు. తమపై ఉన్న కక్షతో తమనే నమ్ముకుని ఉన్న 48 మంది వృద్ధులను బజారుపాలు చేయడం అన్యాయం. మాకు న్యాయం చేసి వృద్ధులను ఆదుకోవాలి.  – రాయి మంగరాజు, ఆశ్రమ నిర్వాహకుడు

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)