Breaking News

కరికి షాక్‌!

Published on Fri, 01/23/2026 - 05:50

అడవిలో కడుపు నిండా మేత లేక.. చాలినంత నీరు దొరక్క ఏనుగులు పొలం బాట పడుతున్నాయి. తమకిష్టమైన టమాట, వరి, అరటి, మామిడి తోటలపై పడి ఆరగిస్తున్నాయి. అడవి నుంచి బయటకొచ్చి వెళ్లేటప్పుడు మార్గమధ్యంలో మృత్యువులా వేలాడుతున్న కరెంట్‌ తీగలు తగులుకుని ప్రాణాలు విడుస్తున్నాయి. గత పదేళ్లలో మొత్తం 23 ఏనుగులు మృతిచెందగా.. వాటిలో 15 దాకా కరెంట్‌ షాక్‌తో మృతిచెందడం అటవీశాఖ అధికారుల భద్రతా చర్యలను ప్రశ్నిస్తున్నాయి. మరికొన్ని పాడుబడిన బావుల్లో.. ఇంకొన్ని మదపుటేనుగుల పెనుగులాటల్లో ప్రాణాలు కోల్పోయాయి. తాజాగా చిత్తూరు జిల్లా  పెద్దపంజాణి మండలం, కల్లుపల్లి వద్ద మదపుటేనుగు మృత్యువాత పడింది.  

పలమనేరు: కౌండిన్య ఎలిఫెంట్‌ శాంచురీనిలో ఏనుగుల మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. అడవి దాటిన ఏనుగుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. అడవిలోంచి మేతకోసం వచ్చే ఏనుగులు పలు రకాల ప్రమాదాల బారినపడి మృతిచెందుతున్నాయి. తాజాగా  కల్లుపల్లి వద్ద ఓ మదుపుటేనుగు అనుమానాస్పదంగా మృతి చెందింది. దీంతో ఇప్పటికి 23 ఏనుగులు మృతిచెందాయి. ఏనుగులను కాపాడుకోవడంలో అటవీశాఖ విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

ఆహా‘కా’రం! 
కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులకు అవరసమైన ఆహారం తక్కువ. ఇష్టౖమైన ఆహారం కోసం అడవిని దాటుతున్నాయి. భయానికి గురై అటవీశాఖ ఏర్పాటు చేసిన సోలార్‌ఫెన్సింగ్, ఎలిఫెంట్‌ ట్రెంచ్‌లను ధ్వంసం చేసి బయటకు వస్తున్నాయి. పొలాల్లోని మామిడి, టమాట, వరి లాంటి ఇష్టమైన ఆహారం కోసం అన్వేíÙస్తున్నాయి. మరికొన్ని కొత్త ప్రాంతాలకు వెళుతున్నాయి. ఇటీవల కాలంలో కౌండిన్యలోని ఏనుగులు గంగవరం, పెద్దపంజాణి, సోమల మీదుగా చంద్రగిరివైపు, బంగారుపాళెం, గుడిపాల వైపు వెళ్లాయి.  

మదపు టేనుగులే బలి!
చిత్తూరు జిల్లాలోని పలమనేరు, కుప్పం, చిత్తూరు ఫారెస్ట్‌రేంజ్‌ల పరిధిలోని కౌండిన్య అభయారణ్యంతోపాటు తమిళనాడులోని మోర్థన ప్రాంతం, క్రిష్ణగిరి, ధర్మపురి, కావేరిపట్నం, కర్ణాటకలోని హొసూర్, బన్నేర్‌గట్టల నుంచి తరచుగా కౌండిన్యలోకి ఏనుగులు ప్రవేశిస్తుంటాయి. వీటిల్లో 23 ఏనుగులు వివిధ కారణాలతో మృతిచెందాయి. గత పదేళ్లలో కరెంట్‌ షాక్‌లతోనే 15 ఏనుగులు మృతిచెందాయి. మిగిలినవాటిల్లో మూడు మొగిలి ఘాట్‌ రోడ్డు ప్రమాదంలో చనిపోగా.. మరో రెండు మదపుటేనుగుల దాడులతో, మిగిలినవి పాడుబడిన బావు ల్లో పడడంతో చనిపోయాయి. ముఖ్యంగా ఏనుగులకు కరెంట్‌ శత్రువులా మారింది. మేతకోసం అడవిని దాటి పంటలపైకొచ్చే ఏనుగులు ఎక్కువగా కరెంట్‌షాక్‌లతో మృతిచెందుతున్నాయి.  

సమాచారం
⇒ కౌండిన్యలో మొత్తం ఏనుగులు 107 దాకా
⇒ ఈ ప్రాంతంలో ఎక్కువగా సంచరించే ఏనుగులు 71 దాకా
⇒ కరెంట్‌ షాక్‌తోనే మృతిచెందిన ఏనుగులు 15 
⇒ తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే సంచార ఏనుగులు 36
⇒ ఇప్పటిదాకా వివిధ కారణాలతో మృతిచెందిన మొత్తం ఏనుగులు 23  

శాశ్వత పరిష్కారం చేపడితేనే 
అడవిని దాటి ఏనుగులు రాకుండా అటవీశాఖ శాశ్వత పరిష్కారాలను చూపడంతో విఫలమవుతోంది. తాజాగా కుంకీ ఏనుగుల ద్వారా అడవిలోని ఏనుగులను కట్టడి చేసే కార్యక్రమం సైతం విజయవంతం కాలేదు. దీంతో ఏనుగులు యథేచ్ఛగా అడవిని దాటి బయటకొస్తున్నాయి. జాతీయ సంపదైన ఏనుగులను కాపాడుకొనేందుకు అటవీశాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)