తిరుపతిలో విద్యుత్‌ ఉద్యోగుల మహాధర్నా

Published on Thu, 07/16/2026 - 05:11

తిరుపతి రూరల్‌: విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యల పరిష్కారం, రెగ్యులరైజేషన్, పాత పెన్షన్‌ విధానం అమలు, పీఆర్‌సీ ప్రకటించాలంటూ సీఐటీయూ, స్ట్రగుల్‌ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్‌ కాంట్రాక్ట్, రెగ్యులర్‌ ఉద్యోగులు బుధవారం తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్‌ కార్యాలయం ముందు మహా ధర్నా చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా భారీగా కాంట్రాక్టు కార్మికులు తరలివచ్చారు. కార్మికులు లక్ష్మీపురం సర్కిల్‌ నుంచి ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కళాశాల మీదుగా నినాదాలు చేస్తూ ఎస్పీడీసీఎల్‌ కార్యాలయానికి ర్యాలీ వచ్చారు. ధర్నానుద్దేశించి కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 

కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసి వారికి రూ.48 వేల వేతనాన్ని అమలు చేయాలని కోరారు. విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లించాలని, విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నాలను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆగస్టు 10న ‘చలో విజయవాడ’ చేపడతామని ప్రకటించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)