Breaking News

AP: డిస్కంల లోటు రూ.14,683.24 కోట్లు

Published on Sat, 12/07/2024 - 05:34

సాక్షి, అమరావతి: వచ్చే (2025–26) ఆర్థిక సంవత్స­రానికి ఆదాయం, రాబడికి మధ్య వ్యత్యాసం రూ.­14,683.24 కోట్లుగా డిస్కంలు అంచనా వేశాయి. ఈ మేరకు ఆదాయ, అవసరాలు (ఏఆర్‌ఆర్‌), ప్రతిపా­దిత టారిఫ్‌ (ఎఫ్‌పీటీ) నివేదికలను అంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు గత నెల 30న ఏపీఈఆర్‌సీకి సమర్పించాయి. ఆ ప్రతిపాదనలను ఏపీఈఆర్‌సీ తన వెబ్‌సైట్‌లో శుక్రవా­రం ప్రజలకు అందుబాటులో ఉంచింది. 

డిస్కంలు పేర్కొ­న్న లెక్కల ప్రకారం.. వచ్చే ఏడాది మొత్తం రూ.­58,868.52 కోట్ల వ్యయం అయితే, టారిఫ్‌ యేతర ఆదా­య మొత్తాలను కలుపుకుని విద్యుత్‌ విక్రయం ద్వారా రూ.44,185.28 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశాయి. ఫలితంగా రూ.14,683.24 కోట్ల లోటు ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. అదేవిధంగా 75,926.22 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ విక్రయం జరుగుతుందని, ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024–25 (73,053.78 మిలియన్‌ యూనిట్లు) కంటే 3.93 శాతం ఎక్కువని డిస్కంలు నివేదికలో చెప్పాయి. 

ఉచిత వ్యవసాయ విద్యుత్‌ వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11,299.49 మిలియన్‌ యూనిట్ల కంటే 14.4 శాతం ఎక్కువగా 12,927 మిలియన్‌ యూనిట్ల వరకు ఉంటుందని అంచనా వేశాయి. ప్రస్తుత టారిఫ్‌ ప్రకారం డిస్కంల ఆదాయ అంతరాన్ని తీర్చడానికి వచ్చే ఏడాది మొత్తం రూ.14,683.24 కోట్ల సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆమోదించబడిన సబ్సిడీ (రూ.13,769.85 కోట్లు) కంటే ఇది 6.6 శాతం పెరిగింది. 

విద్యుత్‌ కొనుగోలు వ్యయం యూని­ట్‌కు రూ.4.80 అవుతుందని నివేదికలో పొందుపరి­చాయి. ట్రాన్స్‌మిషన్‌ డిస్ట్రిబ్యూషన్‌ నష్టాలు 10.03 శాతంగా ప్రతిపాదించాయి. విద్యుత్‌ సరఫరా సగటు వ్యయం యూనిట్‌ కు రూ.7.75 పేర్కొనగా.. రాబడి మాత్రం యూనిట్‌కు రూ.5.82 ఉంటుందని డిస్కంలు భావిస్తున్నాయి. డిస్కంలు ఇచ్చిన ఈ ప్రతిపాదనలపై ఏపీఈఆర్‌సీ బహిరంగ విచారణ నిర్వహించి టారిఫ్‌ ప్రకటిస్తుంది. కొత్త టారిఫ్‌ ప్రకారం విద్యుత్‌ చార్జీలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తాయి. 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)