Breaking News

చార్జీలు పెరిగాయి.. కరెంటు వాడకం తగ్గిద్దాం!

Published on Wed, 08/27/2025 - 06:17

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో..
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు నిరంతరం సరఫరా. అద్భుత ఫలితాలు సాధించిన రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు. ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి, వినియోగదారుల సంక్షేమానికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించడం అత్యంత కీలకమనే భావన. రాష్ట్రంలో సగటు విద్యుత్‌ వినియోగం జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదు.

కూటమి సర్కారులో..
విద్యుత్‌ చార్జీలను భారీగా పెంచి ప్రజలపై భారం మోపేందుకు అన్ని విధాలా ప్రయత్నం. ఫలితంగా విద్యుత్‌ వాడాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి. ఏకంగా 20 మిలియన్‌ యూనిట్ల వరకు డిమాండ్‌ తగ్గిపోయింది.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐదేళ్ల కిందట విద్యుత్‌ వినియోగదారుల సంఖ్య 1.45 కోట్లు. మూడేళ్ల క్రితం ఈ సంఖ్య 1.92 కోట్లకు పెరిగింది. కోతలు లేకుండా సరఫరా అందించడంతో పాటు వివిధ వర్గాలకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యుత్‌ రాయితీలు కల్పించింది. చార్జీల భారం వేయకుండా ఊరటనిచి్చంది.

 దీంతో సర్వీసులు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. మారుమూల పల్లెలకు సైతం లైన్లు వేయడంతో ఇదివరకు బిల్లులకు భయపడి వెలుగులకు నోచుకోని వారి ఇంట కూడా విద్యుత్‌ కాంతులు ప్రకాశించాయి. ఇది రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాల మెరుగు, విద్యుత్‌ రంగ ప్రగతికి సూచిక అని నిపుణులు   అభివర్ణించారు. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులు అవుతోంది.

⇒  కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రూ.15,485.36 కోట్ల కరెంట్‌ చార్జీల భారాన్ని ప్రజలపై వేసి బాదుడికి శ్రీకారం చుట్టింది. మరో రూ.3,629.36 కోట్ల చార్జీల మోతకు అనుమతించాలంటూ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి ప్రతిపాదనలు సమర్పించింది. అంటే, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ఏకంగా రూ.19,114.72 కోట్ల భారం ప్రజలపై మోపినట్లైంది.

⇒ తాజాగా ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు 4వ నియంత్రణ కాలానికి వాస్తవ ఆదాయ, ఖర్చుల వ్యత్యాసాన్ని రూ.12,771.96 కోట్లుగా లెక్కించాయి. ఈ మొత్తాన్ని బిల్లుల్లో కలిపి వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతినివ్వాలని కమిషన్‌ను కోరా>యి. దీనిని రాష్ట్ర ప్రభుత్వం భరించకపోతే ప్రజలపై మొత్తంగా రూ.31,886.68 కోట్ల చార్జీల భారం వేసినట్లవుతుంది.

⇒ భారీ విద్యుత్‌ భారాన్ని చూసి బెంబేలెత్తిపోతున్న ప్రజలు వినియోగం తగ్గించేస్తున్నారు. కాగా,సూక్ష్మ, చిన్న మధ్య తరహా, కుటీర పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాలు, గృహాల్లో విద్యుత్‌ వాడకం తగ్గడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆర్థిక 
నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)