Breaking News

మరో విద్యుత్‌ ఉద్యమానికి సిద్ధం

Published on Sat, 11/09/2024 - 05:24

సాక్షి, అమరావతి: సర్దుబాటు పేరుతో ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపటం దుర్మార్గమని, ఆ చార్జీ­లను రద్దు చేసే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్య­మాన్ని తీవ్రతరం చేస్తామని వామపక్షాల నేతలు ప్రకటించారు. విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యా­ల­యంలో వామపక్ష పార్టీల నేతలు సమావేశమ­య్యా­రు. అనంతరం సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యద­ర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావు విలేకరుతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్ప­టికే సర్దుబాటు చార్జీల భారం రూ.6,072 కోట్లు మోపగా, ఇప్పుడు మరో రూ.11 వేల కోట్ల భారం మోపాలనుకోవడం దుర్మా­ర్గం.

మరో విద్యుత్‌ ఉద్య­మానికి శ్రీకారం చుడ­తాం. టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని చంద్రబాబు చెప్పా­రు. దానికి కట్టుబడి తక్షణమే పెంచిన విద్యుత్‌ చార్జీలను రద్దుచేయాలి. అసెంబ్లీ సమా­వేశాల సంద­ర్భంగా విద్యుత్‌ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 19వ తేదిన విజ­యవాడలో వామపక్షాల నిర­సన తెలియ­జేస్తాం. సనా­తన ధర్మాన్ని పరిరక్షిస్తా­నంటూ ఆర్‌ఎస్‌­ఎస్, బీజేపీ అజెండాను పవన్‌­కళ్యాణ్‌ మోయడం తగదు’ అని చెప్పారు. వివిధ వామపక్ష పార్టీల నేతలు జల్లి విల్సన్, సీహెచ్‌ బాబూరావు, పి.­ప్రసాద్, ఎస్‌కే.ఖాదర్‌­బాషా, కె.పొలారి పాల్గొన్నా­రు.  

18న ఇళ్ల పట్టాల సమస్యలపై వినతిపత్రాలు
ఇళ్ల పట్టాలకు సంబంధించిన సమస్యలపై ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాల­యా­ల్లో అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని జయప్రదం చేయా­లని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపుని­చ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవా­రం ముప్పాళ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన వర్చువ­ల్‌గా జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లా­డుతూ సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వ­రంలో ఈ నెల, వచ్చే నెలలో చేపట్టనున్న ఆందోళనలకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)