Breaking News

సవితమ్మా.. మాక్కొంచెం విషమివ్వు..!

Published on Wed, 07/09/2025 - 04:58

పెనుకొండ రూరల్‌: పొలం కంచె విషయమై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అనుచరులు అధికారులను అడ్డు పెట్టుకుని తమను వేధిస్తున్నారని శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం మావటూరు గ్రామానికి చెందిన వృద్ధ రైతు రఘురామి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆవేదనతో కూడిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్‌గా మారింది. వివరాలు ఆయన మాటల్లోనే... ‘మాకు సర్వే నంబర్‌ 300లో పట్టా భూమి 1.87 ఎకరాలు ఉంది. దీనికి కంచె వేసే విషయమై కొద్ది రోజులుగా  అధికారులను అడ్డు పెట్టు­కు­ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 

ఇప్పటి­కే మా స్థలంలో సీసీ రోడ్డు నిర్మించారు. గ్రా­మ అభివృద్ధికే కదా అని సరిపెట్టుకున్నాం. ఇప్పుడు రోడ్డుపై గ్రామానికి చెందిన వారి పశువులను తోలుతున్నారు. అవి పంటలను మేసేస్తున్నాయి. వాటి నుంచి పంటలకు రక్షణగా పొలానికి కంచె వేసుకున్నాం. దాన్ని తొలగించాలని మంత్రి అనుచరులు గోపాల్, మొద్దన్న, నరసింహప్ప పంచాయతీ సెక్రటరీని, రెవెన్యూ సిబ్బందిని పంపి వేధిస్తున్నారు. లేదంటే కుటుంబం మొత్తం మీద  క్రిమినల్‌  కేసులు పెడతామని భయపెడుతున్నారు. తహసీల్దార్‌ సైతం ఫోన్‌ చేసి కంచె తొలగించాలంటున్నారు. 

కొలతలు వేయించాలని చెప్పినా అధికారులు వినడం లేదు. ఇప్పటికే మంత్రి అనుచరుల వేధింపులు తాళలేక నా కుమారుడు సుధాకర్‌ రెడ్డి ఉరేసుకుని చనిపోయాడు. రూ.ఐదు లక్షల రూపాయలు ఇస్తే సరి.. లేదంటే బోరుబావిని పీకేసి భూమిని సైతం లాక్కుంటామని బెదిరించడంతో నా కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మరణ ధ్రువీకరణ పత్రం విషయంలోనూ మమ్మల్ని వేధించారు. నేను, నా భార్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నాం. మా ఇద్దరు మనవరాళ్ల కోసమే మేము జీవిస్తున్నాం. 

మేము ఏ రాజకీయ పార్టీకీ చెందినవాళ్లం కాదు. అయినా మా కుటుంబం మీద మంత్రి అనుచరులకు పగ ఎందుకో?!  సవితమ్మా.. మా కుటుంబానికి కాస్త విషమివ్వు తల్లీ! మా కడుపులు కొట్టకు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై తహసీల్దార్‌ స్వాతిని ‘సాక్షి’ వివరణ కోరగా... సర్వే నంబర్‌ 298–2లో 3.46 ఎకరాల రస్తా పొరంబోకు భూమి ఉందని, ఇందులో దాదాపు 54  సెంట్ల స్థలాన్ని రైతు ఆక్రమించారని చెప్పారు. ఈ క్రమంలో కంచె తొలగించాలని చెప్పామని పేర్కొన్నారు. 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)