Breaking News

నిద్ర పట్టట్లేదు..బ్రో

Published on Tue, 04/08/2025 - 06:26

⇒ హైపర్‌ టెన్షన్‌ (రక్తపోటు)  
⇒ ఒత్తిడి పెరిగి మధుమేహం  
⇒మతిమరుపు   
⇒ గుండె సంబంధిత సమస్యలు 
⇒ ఊబకాయం 
⇒ మెదడుపై ఒత్తిడి పెరిగి బ్రెయిన్‌ స్ట్రోక్‌

సాక్షి ప్రతినిధి, అనంతపురం: రకరకాల వ్యసనాలు ప్ర­జ­లను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించినా రకరకాల ఒత్తిళ్లు, రుగ్మతలతో రాత్రి ఒంటిగంట దాటినా నిద్ర పట్టడం లేదు. యాభై ఐదేళ్లు దాటిన వారి సంగతి అటుంచితే నిండా ముప్ఫై కూడా లేని కుర్రాళ్లు కూడా ఇబ్బంది పడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.   

30– 40 ఏళ్ల వారిలో ఎక్కువ..  
వాస్తవానికి యువకులకు నిద్రలేమి ఉండకూడదు. కానీ మొబైల్‌ వ్యసనం, బెట్టింగ్‌లు, ఆర్థిక పరిస్థితులు, ఆల్కహాల్, ఉద్యోగాల్లో ఒత్తిడి వెరసి రాత్రి పొద్దు పోయే వరకూ నిద్ర ఉండటం లేదు. మొబైల్‌కు అతుక్కు­పో­తుండటం అతిపెద్ద సమస్యగా మారింది. ఉమ్మడి అ­నంతపురం జిల్లాలో 8 లక్షల మందికి పైగా ముప్ఫై ఏళ్లలోపు యువత చేతుల్లో ఆండ్రాయిడ్‌ ఫోన్‌లు ఉన్నట్టు అంచనా. సామాజిక మాధ్యమాల్లో గంటల కొద్దీ ఉండిపోతూ సమయం సంగతే మరిచిపోయిన పరిస్థితి. దీంతో నలభై ఏళ్లు దాటే లోపే జీవనశైలి జబ్బుల బారిన పడుతున్నట్టు తేలింది. 30 నుంచి 40 ఏళ్లలోపు వారికి నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉన్నట్టు ఇటీవల నిర్వహించిన ఓ పరిశీలనలో వెల్లడైంది.  

జీవనశైలి మార్చుకోవాలి 
నిద్రలేమితో బాధపడుతున్న వారు వ్యసనాలను వదులుకోవాలి. జీవనశైలిని మార్చుకుంటేనే పరిష్కారం లభిస్తుంది. వేళకు తినడం, సమయానికి పడుకోవడం, మొబైల్‌ వినియోగం తగ్గించడం, రోజూ వ్యాయామం వంటివే దీనికి సరైన మందు. ఒక దశ వరకూ నిద్రలేమికి మందులు ఓకే గానీ, మోతాదు మించి వాడకూడదు. దైనందిన జీవితంలో మార్పులు చేసుకుంటే ఫలితం ఉంటుంది. –డా.జాషువా కాలెబ్, న్యూరో ఫిజీషియన్‌  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)