Breaking News

బడుల పైనా ‘బండ’ రాతలే!

Published on Wed, 11/15/2023 - 05:11

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద పిల్లలు కూడా ఉన్నత స్థితిలోకి రావాలని, చదువుల కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు ఉండకూడదని సీఎం వైఎస్‌ జగన్‌ విద్యా రంగంలో అనేక సంస్కరణలు తెచ్చారు. ‘మన బడి నాడు – నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను నూతన భవనాలు, అత్యాధునిక సౌకర్యాలతో కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా తీర్చి దిద్దుతున్నారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం అందిస్తున్నారు. పేద విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిని 

అందుకొనేలా ఇంగ్లిష్‌ మీడియం, డిజిటల్‌ బోధన అందిస్తున్నారు. చంద్రబాబు జమానాలో పాఠశాలల పైకప్పులు కూలిపోయినా, బెంచీలు, నీరు లేకపోయినా, టెక్ట్స్‌బుక్స్‌ ఇవ్వకపోయినా కదలని ‘ఈనాడు’ కలం.. అవే పాఠశాలల్ని అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై విషం కక్కుతోంది. రెండో దశలో నిర్మాణంలో ఉన్న నాలుగు బడుల ఫొటోలు తీసి ఏమీ జరగడంలేదంటూ కుటిల కథనం ప్రచురించింది. 

అసలు వాస్తవాలివీ..
♦ మనబడి నాడు నేడు రెండో దశలో ప్రభుత్వం రూ.8,000 కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు చేపట్టింది.  8,529 పాఠశాలల్లో 25,154 అదనపు తరగతి గదులు కూడా నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకు పూర్తి చేసేలా పనులు చేస్తున్నారు.

♦ ఏలూరు ఆరో డివిజన్‌లోని నగరపాలకోన్నత పాఠశాలలో రెండో దశలో రూ.1.08 కోట్లతో 9 అదనపు తరగతి గదుల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటివరకు రూ.62 లక్షల విలువైన పనులు పూర్తి చేశారు. 

♦  కర్నూలు జిల్లా కోసిగి జేబీఎం ప్రాథమిక పాఠశాలలో రూ.21.10 లక్షలతో పనులు చేపట్టారు. ఇప్పటివరకు రూ.14.98 లక్షల విలువైన పనులు పూర్తి చేశారు.

♦ విజయవాడ కృష్ణలంక బాలికల పాఠశాలలో రూ.62.87 లక్షలతో పనులు చేపట్టారు. ఇందులో రూ.19.06 లక్షల విలువైన పనులు పూర్తి చేశారు. ఇదే పాఠశాలలో రూ.58.90 లక్షలతో ఐదు అదనపు తరగతి గదుల నిర్మా­ణం కూడా చేపట్టి, రూ.29.73 లక్షల విలువైన పనులు చేశారు. కృష్ణలంకలోనే ఉన్న ఎస్వీఆర్‌ ఎంసీహెచ్‌లో రూ.62.94 లక్షలతో పనులు చేపట్టి, రూ.27.55 లక్షల విలువైన పనులు పూర్తి చేశారు. ఏపీఎస్సార్‌ మున్సిపల్‌ హైస్కూల్లో రూ.81.18 లక్షలతో పనులు చేపట్టి రూ.33.13 లక్షల విలువైన పనులు చేశారు. రూ.47.79 లక్షలతో 4 అదనపు తరగతి గదులను కూడా నిర్మిస్తున్నారు.

♦తిరుపతి జిల్లాలోని ఎంజీఎం మున్సిపల్‌ హైస్కూల్లో రూ.84 లక్షలతో ఏడు అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. రూ.19.63 లక్షల పనులు పూర్తి చేశారు.

♦  విశాఖ జిల్లా గంభీరం ఎంపీపీ పాఠశాలలో రూ.17.82 లక్షలతో చేపట్టిన పనుల్లో రూ.10.81లక్షల విలువైన పనులు పూర్తి చేశారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)