Breaking News

డబ్బా కాదు బాస్‌.. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ 

Published on Sat, 03/09/2024 - 02:36

సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం గ్రామ గ్రామాన, వాడవాడలా వైద్య శిబిరాలు నిర్వహించి, పేదల ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టిన దాఖలాలు ఉన్నాయా? అంత మంది వైద్యులు, వైద్య సిబ్బంది ప్రజలను పరీక్షించి, మందులు ఉచితంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? అది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే సాధ్యమైంది. ప్రజారోగ్యంపై సీఎం వైఎస్‌ జగన్‌కు ఉన్న చిత్తశుద్ధికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష (జేఏఎస్‌)’ కార్యక్రమం ఒక ప్రబల నిదర్శనం.

ఆరోగ్య శ్రీ పథకం, 108, 104, తల్లీపిల్లల ఎక్స్‌ప్రెస్, ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునీకరణ, వేల కోట్లతో నూతన వైద్య కళాశాలల ఏర్పాటు, వైద్య రంగంలో ఖాళీలన్నవి లేకుండా ఎప్పటికప్పుడు వైద్యులు, వైద్య సిబ్బంది నియామకం.. ఇవన్నీ ప్రజారోగ్యం పట్ల వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ నిబద్ధతకు తార్కాణాలు. గ్రామగ్రామాన, వాడవాడలా జేఏఎస్‌ శిబిరాల్లో లక్షలాది మందికి స్పెషలిస్టు వైద్యులు పరీక్షలు చేసి, అవసరమైన వారిని ఆస్పత్రులకు రెఫర్‌ చేశారు. ఇంత మంది శిబిరాలకు వచ్చి వైద్య సేవలు పొందితే రామోజీకి కనిపించవు. అంతా ఖాళీగా ఉన్నట్టు భ్రమిస్తూ ఉంటారు.

ఉమ్మడి రాష్ట్రానికి, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కలిపి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏనాడైనా ఒక్క వైద్య శిబిరం నిర్వహించారా? ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల కట్టించారా? ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్క విభాగాన్నైనా ఆధునీకరించాచా? ఆయన హయాంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఎంత దయనీయ స్థితికి వెళ్లిందో ప్రతి ఒక్కరికీ కళ్లకు కట్టింది. ప్రభుత్వ ఆస్పత్రి అంటే పాములు, ఎలుకల నిలయాలుగా పేరుపడ్డాయి. ఇంత దారుణ వ్యవస్థ రాజ్యమేలిన రోజుల్లో కళ్లు మూసు­కున్న రామోజీ.. నేడు ప్రజలంతా ఆరోగ్యాన్ని తిరిగి పుంజుకుంటుంటే చూడలేకపోతున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్సలు అందిస్తుండటం ఆదర్శనీయమని దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తుంటే.. పచ్చ బాసు రామోజీకి మెదడు మొద్దుబారింది. పచ్చ రోగం ముదిరిపోయి కడుపు మంట కథనాలు అచ్చేస్తున్నారు. అదే క్రమంలో జేఏఎస్‌ శిబిరాలపైనా పడ్డారు. ‘ఎందుకీ శిబీరాలు!’ అంటూ ఈనాడులో ఓ కుటిల కథనం అచ్చేశారు. 

ప్రజలపై భారం లేకుండా చేయడం సొంత డబ్బానా?
ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధి కలిగిన సీఎం జగన్‌ 58 నెలల పాలనలో అనేక సంస్కరణలు చేపట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి ప్రజలకు బీపీ, షుగర్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలు గుర్తించి, సురక్ష శిబిరాలను ఏర్పాటు చేసి స్పెషలిస్ట్‌ వైద్య సేవలు అందిస్తున్నారు. జేఏఎస్‌ తొలి విడతలో భాగంగా గత ఏడాది 1.45 కోట్ల ఇళ్లలో ఉన్న వారి ఆరోగ్య పరిరక్షణకు 6.45 కోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు.

12 వేలకు పైగా వైద్య శిబిరాల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 60.28 లక్షల మంది వైద్య సేవలు అందుకున్నారు. కంటి చూపు సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న 80,115 మందికి కేటరాక్ట్‌ సర్జరీలు చేయించారు. ఇరత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 86,713 మందిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు డాక్టర్లు పంపించారు.

వీరందరికీ ప్రభుత్వమే ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద కేటరాక్ట్‌ సర్జరీలు, అవసరమైన చికిత్సలు చేయించింది. ఆస్పత్రులకు వెళ్లి రావడానికి ఖర్చుల కింద ఒక్కొక్కరికి రూ.500 చొప్పున అందించింది. 5.73 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసింది. తొలి విడతలో 2.51 లక్షల మంది హైపర్‌టెన్షన్, 1.54 లక్షల మంది షుగర్‌ కేసులను కొత్తగా గుర్తించి, బాధితులకు ఫాలోఅప్‌ వైద్యం అందిస్తోంది.

ఈ ఏడాది జనవరి నెలలో రెండో విడత జేఏఎస్‌ను ప్రారంభించి ఇప్పటివరకు 27.33 లక్షల మందికి సురక్ష శిబిరాల్లో వైద్య సేవలు అందించింది. 12,837 మందిని ఆస్పత్రు­లకు రెఫర్‌ చేయగా 4,609 మందికి ఇప్పటికే చికిత్సలు అందించారు. 2,313 మందికి కేటరాక్ట్‌ అవసరమని వైద్యులు సూచించగా ఇప్పటివరకు 1,740 మందికి సర్జరీలు చేశారు.

ఈ మొత్తం ప్రక్రియలో ప్రజలు వైద్యుల కన్సల్టేషన్, పరీక్షలు, మందులు, చికిత్సలు, చివరికి దారి ఖర్చులకు కూడా ఒక్క రూపాయి చేతి నుంచి ఖర్చు పెట్టలేదు. పైపెచ్చు తాముంటున్న గ్రామం, వార్డులకే వైద్యులు వెళ్లి ప్రజలకు సేవలు అందించారు. ఇదంతా గమనిస్తే ఇంగితం ఉన్న ఎవ్వరికైనా ప్రజలకు ఎంతో మేలు జరిగిందనే వాస్తవం కనిపిస్తుంది. ఒక్క రామోజీకి తప్ప. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)