Breaking News

7, 10 తరగతులకు ‘ఈఈఎంటీ’ ప్రతిభా పరీక్ష

Published on Wed, 12/27/2023 - 04:58

సాక్షి, అమరావతి: విద్యార్థుల్లో ప్రతిభను పోత్సహిం­చేందుకు ఎడ్యుకేషనల్‌ ఎపిఫనీ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ‘ఈఈఎంటీ–2024’ (ఎడ్యుకేషనల్‌ ఎపిఫనీ మెరిట్‌ టెస్ట్‌) పరీక్ష తోడ్పడుతుందని పాఠ­శాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలి­పారు. విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యా­లయంలో  ఈఈఎంటీ షెడ్యూల్‌ను మంగళవారం ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 7, 10 తరగతి విద్యార్థులకు గత 11 సంవత్సరా­లు­గా ఆన్‌లైన్‌లో ఈ ఉచిత టెస్ట్‌ నిర్వహిస్తున్నారని తెలిపారు. పిల్లల్లో ప్రతిభా పాటవాలను వెలికి తీసే­లా ఈ పోటీలు ఉంటాయన్నారు.

జనవరి 23న ప్రిలి­మనరీ, 31న మెయిన్స్‌ పరీక్ష ‘కోడ్‌ తంత్ర’ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఈ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షకు రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసు­కోవాలని ఆదే­శించారు. బుధవారం నుంచి జన­వరి 8వ తేదీ వర­కు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు.

162 మంది విజేతలకు రూ.9 లక్షల బహుమతులు 
7, 10 తరగతుల్లో డిసెంబర్‌ వరకు పూర్తయిన సిలబస్‌పై 80 శాతం ప్రశ్నలు, జనరల్‌ నాలెడ్జిపై మరో 20 శాతం ప్రశ్నలు ఉంటాయి. కాగా, ఈ పో­టీ­ల్లో మొత్తం 162 మంది విజేతలకు దాదాపు రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు అందిం­చనున్నారు. మరో 1,752 మందికి మెడల్స్, ప్రశం­­సాపత్రాలు అందజేస్తారు. రాష్ట్రస్థాయిలో పదో తరగతిలో ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు, తృతీ­య బహు­మతి రూ.20 వేలు ప్రకటించారు.

ఏడో తరగతిలో రాష్ట్ర స్థాయి మొదటి విజేతకు రూ.20 వేలు, రెండో విజేతకు రూ.15 వేలు, మూడో విజేతకు రూ.10 వేలు బహుమతిగా అందిస్తారు. ఈ పరీక్షకు ఎస్సీ­ఈఆర్టీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ప్రతాప్‌­రెడ్డి, ఎపిఫనీ సంస్థ ప్రతినిధి డి.నభీ కోఆర్డినేట­ర్లుగాను, వి.ఎస్‌.­సుబ్బారావు పరీక్షా కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.https:// educationalepiphany.org/eemt 2024/registration.php   లింక్‌ ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

పూర్తి వివరాలకు   https:// educationalepiphany.org/   వెబ్‌సైట్‌లో గాని, 96667 47996 నంబర్‌లోగాని సంప్రదించి తెలుసుకోవచ్చు. ఈ సమావేశంలో ఎడ్యుకేషనల్‌ ఎపిఫనీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ తవనం వెంకటరావు, ఉపాధ్యక్షుడు హేమచంద్ర, కన్వీనర్‌ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)