Breaking News

సచివాలయాల్లో ఆగిన ‘ఈసీ’ సేవలు

Published on Wed, 11/13/2024 - 05:18

సాక్షి, అమరావతి: ఇళ్లు, భూములు వంటి పలు రకాల స్థిరాస్తులను ఒకరి నుంచి మరొకరు కొనుగోలు సమయంలోనూ, రైతులు తమ వ్యవసాయ భూముల ఆధారంగా బ్యాంక్‌ల నుంచి తక్కువ వడ్డీకి పంట రుణాలు పొందడంలో అత్యంత కీలక డ్యాకుమెంట్‌గా ఉండే ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ)ల జారీ నాలుగైదు నెలలుగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఆగిపోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వీటి జారీ గ్రామ/వార్డు సచివాలయాల్లోనూ అందుబాటులో ఉంది. 

ఇప్పుడు కేవలం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా మాత్రమే ఈ సేవలు పొందాలి్సన పరిస్థితి. రెవెన్యూ శాఖలో ఉండే ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో సాంకేతిక అవాంతరాలు ఏర్పడి 2024 మార్చిలో గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఈసీ జారీకి చిక్కులు ఏర్పడ్డాయి. మే నెలాఖరుకు ఆ వెబ్‌సైట్‌లో సాంకేతిక అవాంతరాలు పరిష్కరించబడినా ఇప్పటికీ ఆ సేవలను సచివాలయాల ద్వారా అందజేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.

సచివాలయాల టాప్‌ సేవల్లో ఒకటి..
గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా గత ఐదేళ్లూ ప్రజలకు అందిన 540 పైబడిన సేవల్లో అత్యధికంగా అందిన ప్రజలు వినియోగించుకున్న సేవలు ఈసీ సర్టిఫికెట్ల జారీ ఒకటని అధికార వర్గాలు తెలిపాయి. సచివాలయాల శాఖ గణాంకాల ప్రకారం..2022 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి మధ్య 3,73,907 మంది గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఈసీ జారీ సేవలను వినియోగించుకున్నారు. కొన్ని సందర్భాల్లో మొత్తం సచివాలయాల సేవల్లో టాప్‌–15 జాబితాలోనూ ఈసీల జారీ సేవ ఉండేదని అధికారులు చెప్పారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)