Breaking News

సంక్షేమ హాస్టల్‌ బాలికపై లైంగిక దాడి

Published on Thu, 10/23/2025 - 04:37

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సంక్షేమ హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన బాలిక రాజమహేంద్రవరంలోని సంక్షేమ హాస్టల్లో ఉంటూ టెన్త్‌ చదువుతోంది. ఆమెకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడకు చెందిన పాము అజయ్‌(22) పరిచయమయ్యాడు. ఆ బాలికను చెల్లి అని çసంబోధిస్తూ ఏదైనా అవసరమైతే తనకు చెప్పమనేవాడు.

ఈ క్రమంలో సోమవారం సా.5 గంటల సమయంలో బాలిక సబ్బులు, ఇతర వస్తువులు తెచ్చుకుంటానని హాస్టల్‌ వార్డెన్‌ ఉమాదేవికి చెప్పి బయటకెళ్లింది. అయితే, అదేరోజు రాత్రి 7 గంటలకు బాలిక తల్లి హాస్టల్‌కు వచ్చింది. అదే సమయంలో బాలిక బయటి నుంచి రావడంతో ఎక్కడికి వెళ్లావని తల్లి నిలదీసింది. బాలిక జరిగినదంతా తల్లికి చెప్పింది. తనను అజయ్, రావులపాలెం మండలం రావులపాడుకు చెందిన అతడి స్నేహితుడు కాగితపల్లి సత్యస్వామి (21) కలిసి బైక్‌ మీద బయటకు తీసుకెళ్లారని, సత్యస్వామి తమను రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న హోటల్‌ వద్ద దింపి వెళ్లిపోయాడని తెలిపింది. ఆ తర్వాత అజయ్‌ హోటల్‌ గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడని చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు వెంటనే లాడ్జి వద్దకు వెళ్లి ఆరా తీయగా లాడ్జి నిర్వాహకులు జరిగిందంతా చెప్పారు. తాము వేరే ఊరు నుంచి పరీక్షలు రాయడానికి వచ్చామని, మర్నాడు వెళ్లిపోతామని యువకుడు చెప్పినట్లు వివరించారు. పోలీ­సులు అజయ్, సత్యస్వామిపై మంగళవారం కేసులు నమోదు చేశారు. అలాగే, మైనర్లకు గది ఇచ్చిన లాడ్జి నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు సమాచా­రం. నిందితులిద్దరినీ పోలీసులు బుధవారం అదుపులో­కి తీసుకున్నారు. వీరిని గురువారం కోర్టులో హా­జరుపర్చనున్నారు. మరోవైపు.. కలెక్టర్‌ కీర్తి చేకూరి హా­స్టల్‌ వార్డెన్‌ ఉమాదేవికి షోకాజ్‌ నోటీసు జారీచేసి సస్పెండ్‌ చేశారు. ఈ సంఘటనపై స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌తో సమగ్ర విచారణ చేపడతామని వెల్లడించారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)