అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
డీజీపీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతల స్వీకరణ
Published on Sat, 06/22/2024 - 04:46
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): డీజీపీగా సీహెచ్.ద్వారకా తిరుమలరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం డీజీపీగా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా డీజీపీకి పోలీసు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అదనపు డీజీలు, ఐజీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో ద్వారకా తిరుమలరావు కాసేపు సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
పోలీసు అధికారుల సంఘం శుభాకాంక్షలు
డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమలరావుకు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం శుభాకాంక్షలు తెలిపింది. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీతో పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
సమర్థుడైన పోలీసు అధికారిగా గుర్తింపు పొందిన ఆయన రాష్ట్రంలో డీజీపీగానూ విజయవంతమవుతారని ఆకాంక్షించారు. పోలీసుల సంక్షేమం కోసం కృషి చేయాలని ఆయన్ని కోరారు. కాగా, డీజీపీ ద్వారకా తిరుమలరావు దంపతులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు.
Tags : 1