Breaking News

విధిలేక విధులు!

Published on Mon, 08/19/2024 - 05:17

ఆధునిక సదుపాయాలతో వైద్య రంగం ఎంత పురోగమిస్తున్నా జూనియర్‌ వైద్యుల (జూడా) వెట్టి చాకిరీకి మాత్రం తెర పడటం లేదు. ప్రాణం పోసే వైద్యులు ఒత్తిడితో ప్రాణాపాయ పరిస్థితిల్లో కూరుకుపోతున్నారు. తమతో యంత్రాలకన్నా ఘోరంగా పని చేయిస్తున్నారని జూడాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కోల్‌కతాలోని ఆర్‌జీకార్‌ ఆస్పత్రిలో హత్యా­చారానికి గురైన రెసిడెంట్‌ వైద్యురాలు 36 గంటలుగా నిరంతరాయంగా విధుల్లో ఉన్నట్టు వెల్లడైంది. – సాక్షి, అమరావతి

ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులతో ఏకదాటిగా రెండు, మూడు రోజులు పనిచేయించడంతో పనిభారం, మానసిక ఒత్తిడికి దారితీస్తోంది. ప్రతి నలుగురు ఎంబీబీఎస్, ఇతర యూజీ కోర్సుల విద్యార్థుల్లో ఒకరు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సర్వే­లో వెల్లడైంది. ప్రతి ముగ్గురు పీజీ విద్యార్థుల్లో ఒకరు ఆత్మహత్య ఆలోచనల్లో ఉన్నట్లు వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. 

ఎన్‌ఎంసీ (జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌) ఆధ్వర్యంలో నేషనల్‌ టాస్క్‌­ఫోర్స్‌ ఫర్‌ మెంటల్‌ హెల్త్, వెల్‌ బీయింగ్‌ దేశ­వ్యాప్తంగా 25,590 మంది ఎంబీబీఎస్, 5,337 మంది పీజీ వైద్య విద్యార్థులు, 7,035 మంది ఫ్యాక­ల్టీని ఆన్‌లైన్‌ సర్వే చేయడం ద్వారా ఈ నివేదికను రూపొందించింది. 28 శాతం మంది ఎంబీబీఎస్, 15 శాతం మంది పీజీ విద్యార్థులు మానసిక సమస్యలు ఎదు­ర్కొంటున్నట్లు చెప్పారు. గత ఏడాది కాలంలో 16.2 శాతం మంది యూజీ, 31.2 శాతం మంది పీజీ విద్యా­ర్థులు తమకు ఆత్మహత్య ఆలోచనలు వచ్చి­న­ట్టు తెలిపారు. 

237 మంది పీజీ విద్యార్థులు ఆత్మహ­త్యా­యత్నానికి పాల్పడినట్లు పేర్కొనడం నివ్వెరప­రు­స్తోంది. సర్వేలో పాల్గొన్న పీజీ విద్యార్థుల్లో 45 శాతం మంది తాము వారానికి 60 గంటలకు పై­గానే పనిచేస్తున్నట్టు వెల్లడించారు. 56 శాతం మంది వారాంతపు సెలవు లేకుండా పనిచేస్తున్నా­మని తెలిపారు. 9.7 శాతం మంది యూజీ, 18 శాతం పీజీ విద్యార్థులు ర్యాగింగ్‌ గురవుతున్నా­మ­న్నా­రు.

ఎంఎన్‌సీ సూచనలివీ..
» రెసిడెంట్‌ డాక్టర్లకు వారానికి 74 గంటల కంటే ఎక్కువ  పని గంటలు వద్దు. వారాంతపు సెలవు ఇవ్వాలి. 
»   వైద్య విద్యార్థులు మానసిక ఒత్తిడి, సమస్యలను అధిగమించేలా యోగా, క్రీడలు, ఇతర కార్యక్రమాలను కళాశాలలు నిర్వహించాలి.  

సంస్కరణలు చేపట్టాలి..
ఎంబీబీఎస్‌తో సమానంగా పీజీ సీట్లు పెరుగుతున్నందున పీజీ వైద్యుల పని వేళ­లను కుదించాలి. 24 గంటల పాటు విధులు నిర్వహించిన జూడాలకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలి. ఆస్పత్రుల్లో వసతులు పెంచాలి.  – డాక్టర్‌ జయధీర్, అదనపు కార్యదర్శి, భారత ప్రభుత్వ వైద్యుల సంఘం 

వసతులు పెంచాలి
ఆర్‌జీకార్‌ ఘటన అభద్రతా భావాన్ని కలిగిస్తోంది. ఆస్పత్రుల సిబ్బందిలో 60 నుంచి 70% మహిళలే ఉన్నా తగిన మౌలిక సదు­పాయాలు లేవు. సీసీ కెమెరాలు పెంచాలి. సిబ్బందిపై చిన్న ఘటన జరిగినా వెంటనే గుర్తించే వ్యవస్థ ఉండాలి. – డాక్టర్‌ జాగృతి, జూనియర్‌ డాక్టర్, సిద్ధార్థ వైద్య కళాశాల

దేశానికే దిశా నిర్దేశం
హైదరాబాద్‌లోని ‘దిశ’ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి అసెంబ్లీలో ’దిశ’ బిల్లు ప్రవే­శపెట్టి దేశానికే దిశా నిర్దేశం చేసింది. నాడు సీఎంగా ఉన్న వైఎస్‌ జగన్‌ ప్రత్యేక చొరవతో తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయానికి దేశమంతా ప్రశంసలు లభించాయి. మహిళలు, బాలి­కల­పై లైంగిక దాడులు, వేధింపుల ఘట­నల్లో కేసు దర్యాప్తు, విచారణ 21 రోజుల్లోపే పూర్తి చేసి దోషి­కి మర­ణ­దండన విధించేలా బిల్లు రూపొందించారు. 

సత్వ­ర విచారణ, శిక్షలు విధించేందుకు ప్రత్యేక పోలీస్‌ బృందాలు, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, ప్రత్యేక కోర్టులు, ఫోరె­న్సిక్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. దిశ యాప్‌ ప్రత్యేకంగా తెచ్చి బాధితులు సమా­చా­రం ఇచ్చి­న పది నిముషాల్లోనే పోలీసులు రక్షణ కల్పించేలా చర్య­లు చేప­ట్టారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)