Breaking News

జగన్‌ పాలనలో తలసరి ఆదాయం భారీగా పెరుగుదల

Published on Mon, 09/16/2024 - 05:16

సాక్షి, అమరావతి: కోవిడ్‌ సంక్షోభం వెంటాడినా.. నవరత్నాల పథకాలతో ప్రజలకు అండగా నిలిచి రాష్ట్ర ఆదాయం పెరగడానికి నాటి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విశేష కృషి చేసింది. దాని ఫలితంగా ఐదేళ్ల జగన్‌ పాలనా కాలంలో రాష్ట్ర తలసరి ఆదాయం భారీగా పెరిగింది. 

ఈ విషయం 2023–24 దేశ ఆర్థిక వ్యవస్థ గణాంకాలతో ఆర్‌బీఐ హ్యాండ్‌ బుక్‌లో స్పష్టమైంది. శుక్రవారం విడుదలైన ఆ హ్యాండ్‌ బుక్‌లో గత పది సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాల్లో తలసరి ఆదాయం పెరుగుదల వివరాలను ఆర్‌బీఐ వెల్లడించింది. గతంలో చంద్రబాబు ఐదేళ్ల పాలన కన్నా వైఎస్‌ జగన్‌ ఐదేళ్ల పాలనలోనే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా పెరిగినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. 

2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు చంద్రబాబు పాలనలో తలసరి ఆదాయం రూ. 60,128 మాత్రమే పెరిగింది. అదే 2019–20 నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరం వరకు వైఎస్‌ జగన్‌ పాలనలో తలసరి ఆదాయం రూ. 88,448 పెరిగిందని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. 

చంద్రబాబు పాలనను తలదన్నేలా
గతంలో చంద్రబాబు ఐదేళ్ల పాలన కాలాన్ని తలదన్నేలా.. వైఎస్‌ జగన్‌ పాలన కాలంలో ప్రతి ఏడాది కూడా జాతీయ సగటు తలసరి ఆదాయాన్ని మించి రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల నమోదైంది. 

2019–20లో దేశ జాతీయ సగటు తలసరి ఆదాయం రూ. 1,52,504 ఉండగా.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అది రూ. 2,14,951కు చేరింది. ఇదే సమయంలో 2019–20లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,60,341 ఉండగా 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి అది రూ. 2,42,479కు చేరింది. 

జీవన ప్రమాణాలు పెరిగిన ఫలితంగా.. 
ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయనడానికి, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందనడానికి తలసరి ఆదాయం కొలమానంగా నిలుస్తుంది. రాష్ట్రం లేదా ప్రాంతం మొత్తం ఆదాయాన్ని అక్కడి జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. రాష్ట్ర జనాభా ఆర్థిక శ్రేయస్సును తలసరి ఆదాయం సూచిస్తుంది. తలసరి ఆదాయం పెరిగింది అంటే ప్రజలు వస్తువులు, సేవలపై ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బును కలిగి ఉన్నట్లు అర్థం. 

ఏదైనా రాష్ట్రం లేదా ప్రాంతం అభివృద్ధికి కొలమానం కూడా తలసరి ఆదాయం పెరుగుదలే. కోవిడ్‌ సమయంలో వ్యవసాయంతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోకుండా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే వివిధ వర్గాల ఆదాయ మార్గాలను పెంచేందుకు, ఆయా రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగేందుకు తగిన వాతావరణాన్ని కూడా ఆనాటి ప్రభుత్వం కల్పించింది. 

ప్రజల చేతుల్లోకి డబ్బులు చేరవేస్తేనే ఆర్థిక రంగానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో నవరత్నాల పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా నగదును బదిలీ  చేసింది. ఫలితంగా రాష్ట్ర తలసరి ఆదాయంలో భారీగా పెరుగుదల నమోదైంది. అంతే కాకుండా గత ఐదేళ్లలో దేశ జాతీయ సగటు తలసరి ఆదాయాన్ని మించి రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగింది. కోవిడ్‌ లాంటి సంక్షోభాలు లేకపోయినా చంద్రబాబు 2014–15 నుంచి 2018–19 వరకు ఐదేళ్ల పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల తక్కువగానే ఉంది.  

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?