Breaking News

మద్యం తాగిన మైనర్‌.. రైలుకింద పడి ఆత్మహత్య

Published on Thu, 10/16/2025 - 05:48

చంద్రగిరి: కూటమి నాయకుల ‘బెల్టు’ దాహం ప్రజల ప్రాణాలను హరిస్తోంది. విచ్చలవిడిగా దుకాణాలు ఏర్పాటు చేయడంతో మద్యం మంచినీళ్లలా దొరుకుతోంది. అంతేకాదు... మైనర్లనూ బలి తీసుకుంటోంది. తాజాగా తిరుపతి జిల్లాలో ఓ విద్యార్థి మ­ద్యం సేవించి పాఠశాలకు రావడంతో ఉపా­ధ్యాయులు మందలించారు. దీంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలంలోని ముంగళి­పట్టు గ్రామానికి చెందిన బాలుడు జస్వంత్‌ (15) ఎం.కొంగరవారిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. 

బుధవారం పాఠశాలకు మద్యం తాగి రావడంతో తోటి విద్యార్థులు గుర్తించి ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు జశ్వంత్‌ బ్యాగ్‌ను తనిఖీ చేయగా, మద్యం బాటిల్‌ లభ్యమైంది. ఉపాధ్యాయులు వెంటనే హెచ్‌ఎం భాస్కర్‌ నాయుడుకు సమాచారం ఇవ్వగా, ఆయన జశ్వంత్‌ను మందలించారు. ఆపై తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఇంతలో జశ్వంత్‌ పాఠశాల గోడ దూకి పారిపోయాడు.

అనంతరం అతడి కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఉన్నాధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో స్కూల్‌ వెనుక వైపు ఉన్న రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. పాకాల రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

బెల్టు దుకాణమే కారణమా? 
చంద్రగిరి మండలంలో బెల్టు దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జస్వంత్‌ బెల్టు దుకాణంలో మద్యం కొనుగోలు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అసలు జస్వంత్‌కు మద్యం ఎక్కడ నుంచి వచి్చంది? ఎవరి వద్ద కొనుగోలు చేశాడు? అనేది అధికారులు తేల్చాల్సి ఉంది. 

వాస్తవంగా 21 ఏళ్లు నిండని వారికి మద్యం విక్రయించడం చట్టరీత్యా నేరం. జస్వంత్‌ వద్ద దొరికిన బాటిల్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా మద్యం ఏ దుకాణంలో కొనుగోలు చేశాడో తెలుసుకోవచ్చు. మరి ఎక్సైజ్‌ అధికారులు ఆ దిశగా విచారణ చేపడతారా? లేక బెల్టు దుకాణాలకు అండగా కేసును నీరుగారుస్తారా? అనేది తేలాల్సి ఉంది.

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)