మత్తులో ఆర్టీసీ బస్‌ ఎత్తుకొచ్చిన మందుబాబు

Published on Sun, 08/02/2026 - 12:00

మదనపల్లె టౌన్‌: సత్యసాయి జిల్లా కదిరి డిపోలో చోరీకి గురైన ఆర్టీసీ బస్సు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పోలీసులకు చిక్కింది. ఈ కేసులో నిందితుడైన శివ మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడ్డాడు. అనంతపురానికి చెందిన శివ తన కుక్కను వెంట తీసుకుని మద్యం మత్తులో అనంతపురం నుంచి రైలులో కదిరికి వచ్చాడు. 

చార్జీలకు డబ్బు లేకపోవడంతో అర్ధరాత్రి కదిరి బస్టాండ్‌ పక్కన పార్క్‌ చేసిన ఆర్టీసీ అద్దె బస్సును అపహరించి దాంట్లో మదనపల్లెకు వచ్చాడు. శనివారం ఉదయం తట్టివారిపల్లి బైపాస్‌ వద్ద బస్సును రోడ్డుపైనే వదిలేసి టూ టౌన్‌ పోలీసులకు లొంగిపోయాడు. జరిగినదంతా చెప్పడంతో పోలీసులు స్థానిక ఆర్టీసీ అధికారులతో పాటు కదిరి ఆర్టీసీ అధికారులకు సమాచారమిచ్చారు. బస్సు అసలు డ్రైవర్‌ శివకుమార్‌ ఆగమేఘాలపై మదనపల్లికి వచ్చాడు. 

అద్దె బస్సు కావడంతో ‘ఓనర్‌ ఆదేశాలతో బస్సుకు డీజిల్‌ పట్టి రాత్రి పార్కింగ్‌ చేసిన కొన్ని క్షణాల్లోనే బస్సును ఎత్తుకెళ్లాడు’ అని ఆయన చెప్పాడు. పోలీసులు బస్సును స్వాధీనం చేసుకుని డిపోలో భద్రపరిచారు. కదిరి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, శివ అటవీ శాఖలో తాత్కాలిక ఉద్యోగి. ఇటీవలే ఆయనను విధుల నుంచి తొలగించగా తీవ్ర మనస్తాపం చెంది రోజూ మద్యం తాగుతున్నాడు. దీంతో ఆయన మానసిక స్థితి బాగాలేదని తెలుస్తోంది. 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)