Breaking News

ఒకవైపు వణికిస్తున్న చలి.. మరొకవైపు కమ్మేస్తున్న పొగమంచు

Published on Tue, 01/10/2023 - 08:44

సాక్షి, అమరావతి/సాక్షి, పాడేరు: రాష్ట్రం చలికి వణుకుతోంది. పశ్చిమ గాలుల ప్రభావంతోనే చలి తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో పొగ మంచు కమ్మింది. ఉత్తర భారతదేశంతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతోపాటు చలి గాలులు వీస్తుండటం వల్ల రాష్ట్రంలోనూ చలి పెరిగిందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ పరిసర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 1 నుంచి 4 డిగ్రీల వరకు పడిపోయాయి.

అల్లూరి సీతారామ­రాజు జిల్లా జి మాడుగులలో సోమవారం తెల్లవారుజామున అత్యల్పంగా 1.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరు, డుంబ్రిగూడ, చింతపల్లి, అర­కు తదితర ప్రాంతాలు చలికి గజగజ వణుకుతున్నా­యి. అర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురవడంతో పలు ప్రాంతాలలో మంచు గడ్డ కట్టింది. పాడేరుకు సమీపంలోని ఎస్పీ కార్యాల­యం ఎదు­ట నిలిపిన కారుపై మంచు పేరుకుపోవడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. పంట భూముల వద్ద మంచు పొరలు ఏర్పడ్డాయి. ఏజెన్సీలో మంచు గడ్డకట్టిన దృశ్యాలను ఎప్పుడూ చూడలేదని స్థానికులు తెలిపారు.  

రాష్ట్రంలోని మిగిలి ప్రాంతాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 5 డిగ్రీల మేర పడిపోయాయి. రాయలసీమలోని పలు ప్రాంతాల్లోనూ అరకు మాదిరిగానే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం­లో 6.3, ఆలూరు మండలం కమ్మరచేడులో 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నం­ద్యాల, సత్యసాయి, అనంతపురం, ప్రకాశం జిల్లా­ల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం 8 డిగ్రీ­లకంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యా­యి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తది­తర ప్రాం­తాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరో 3, 4 రోజులు చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల­లో 1.9 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 2 డిగ్రీలు, కుంతలం, హుకుంపేటలో 2.3, జీకే వీధిలో 2.6, చింతపల్లిలో 2.8, అరకు, డుంబ్రిగూడలో 3.2,  పాడేరులో 3.6, కొక్కిసలో 4.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా మంత్రాలయంలో 6.3, కమ్మరచేడులో 6.5, జి.శింగవరంలో 6.6, కె.నాగలాపురంలో 6.8 డిగ్రీలు నమోదయ్యాయి. విశాఖపట్నం అక్కిరెడ్డిపాలె­ం­లో 11.6, తిరుపతిలో 14.7, విజయవాడ రూరల్‌ నున్నలో 14.9, విజయవాడ గుణదలలో 16.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)