Breaking News

రాజధాని తాగునీటి టెండర్లలోనూ లాలూచీ

Published on Tue, 08/26/2025 - 05:47

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణంలో సిండి‘కేటు’ లాలూచీపర్వం మరోసారి బట్టబయలైంది. తాగునీటి పథకం పనులు ఆస్మదీయ సంస్థ పరమయ్యాయి. అది కూడా.. ఏదో ఒక క్రమ సంఖ్యలా అధిక ధరకు కోట్‌ చేయ­డం.. దానికే పనులు దక్కడం గమనార్హం. ఇదంతా చూస్తే టెండర్లలో కాంట్రాక్టు సంస్థలు కుమ్మక్కైనట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

అమరావతి తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులకు రూ.755.94 కోట్ల వ్యయంతో రెండు ప్యాకేజీల కింద ఏడీసీఎల్‌ (అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. డీబీవో (డిజైన్‌ బిల్ట్‌ ఆపరేట్‌) విధానంలో టెండర్లు పిలిచింది. వీటి పూర్తికి 750 రోజులు గడువు నిర్దేశించింది. ఏడేళ్ల పాటు పథకాన్ని నిర్వ­హించి, తర్వాత ఏడీసీఎల్‌కు అప్పగించాలని షరతు విధించింది.

⇒ కృష్ణా నది నుంచి రోజుకు 190 మిలియన్‌ లీటర్ల నీటిని తరలించి, శుద్ధి చేసి నిల్వ చేసేందుకు 64 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో చేపట్టే సెమీ అండర్‌గ్రౌండ్‌ రిజర్వాయర్‌ పనులకు రూ.394.60 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించింది. వీటికి 4.29 శాతం అధిక ధరకు అంటే రూ.411.53 కోట్లకు కోట్‌ చేసింది ఎన్‌సీసీ.

⇒  రాజధాని ప్రాంతంలో తాగునీటి సరఫరా కోసం 45.28 కి.మీ. పొడవునా డి్రస్టిబ్యూషన్‌ వ్యవస్థను, ఈ వ్యవస్థకు నీటిని సరఫరా చేయడానికి 57.84 కి.మీ. పొడవునా ఫైప్‌లైన్‌ వేసే పనులకు రూ.361.34 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించింది. ఈ పనులకు 4.28 శాతం అధిక ధరకు అంటే రూ.376.80 కోట్లకు కోట్‌ చేసింది ఎన్‌సీసీ.

⇒  రెండు ప్యాకేజీల్లోనూ ఎన్‌సీసీనే ఎల్‌–1గా నిలవడం గమనార్హం. ఈ సంస్థకే పనులు అప్పగిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ఖజానాపై రూ.32.39 కోట్లకుపైగా అదనపు భారం పడింది. ఒకవేళ ఈ పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి ఉంటే కనీసం రూ.వంద కోట్ల మేర ఆదా అయ్యేవని ఇంజినీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సిండికేటు సభ్య సంస్థకే...
రాజధాని సిండి‘కేటు’ కాంట్రాక్టు సంస్థల్లో ఎన్‌సీసీ కూడా ప్రధానమైనది. టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయక ముందే ముఖ్య నేత కనుసైగలతో ఆ పనులు ఎన్‌సీసీకి దక్కుతాయనే చర్చ కాంట్రాక్టు వర్గాల్లో జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది.. కాంట్రాక్టు సంస్థలు సిండికేటై.. అధిక ధరకు కోట్‌ చేయడం వల్ల ఖజానాపై అదనపు భారం పడింది.

ఈ పనులను అప్పగిస్తూ ఎన్‌సీసీతో ఏడీసీఎల్‌ అధికారులు ఒప్పందం చేసుకున్న వెంటనే.. కాంట్రాక్టు విలువలో పది శాతం అంటే రూ.78.83 కోట్లను ఆ సంస్థకు మొబిలైజేషన్‌ అడ్వాన్సు కింద ముట్టజెప్పనున్నారు. ఆ తర్వాత అందులో 8 శాతం ముఖ్యనేత.. 2 శాతం కాంట్రాక్టు సంస్థ నీకింత నాకింత అంటూ పంచుకోనున్నాయి.

అంచనాలను పెంచేసి...
రాజధాని తాగునీటి పథకం అంచనాలను భారీగా పెంచేసినట్లు ఇంజినీరింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. జ్యుడిíÙయల్‌ ప్రివ్యూ వ్యవస్థ అమల్లో ఉండి ఉంటే ఈ అక్రమాలు బయటకొచ్చేవని, అంచనా వ్యయం తగ్గేదని స్పష్టం చేస్తున్నాయి.

⇒  ఎన్‌సీసీకి రాజధాని ప్రాంతంలో ఇప్పటికే రూ.8,838.83 కోట్ల విలువైన పనులు అప్పగించారు. ఇప్పుడు రాజధాని తాగునీటి పథకం కూడా కట్టబెట్టడంతో మొత్తం రూ.9,627.16 కోట్ల విలువైన పనులు దక్కినట్లయింది.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)