Breaking News

దాహం తీర్చండి.. మహాప్రభో!

Published on Fri, 01/23/2026 - 05:45

రొళ్ల/మడకశిర: శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియో­జకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. వేసవి రాకముందే పలు గ్రామాల్లో తీవ్ర నీటిఎద్దడి నెలకొంది. దీంతో తరచూ ఏదో ఒక గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా గురువారం మడకశిర పట్టణంలోని వడ్రపాళ్యం కాలనీ, రొళ్ల మండలం కొడగార్ల గుట్ట (కేజీ గుట్ట) కాలనీ మహిళలు రోడ్డెక్కి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. 

మడకశిర వడ్రపాళ్యం కాలనీలో 20 రోజులుగా తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా­రు. బోరు మోటారు కాలిపోవడంతో సమస్య ఏర్పడింది. అప్పటి నుంచి రెండు కిలోమీటర్ల దూ­రం వెళ్లి ద్విచక్ర వాహనాలపై నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ సమస్యను మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన మహిళలు గురువారం ఖాళీ బిందెలతో మడకశిర–హిందూపురం ప్రధాన రహదారిపై ధర్నా చేశా­రు. 

దీంతో గంటల తరబడి వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. పోలీసులు వచ్చి ఆందోళన విరమించాలని కోరగా.. సమస్య పరి­ష్కరించే వర­కు ఇక్కడి నుంచి కదిలేది లేదని మహిళలు భీష్మించారు. చివరకు మున్సిపల్‌ అధికారులు వచ్చి సమ­స్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటా­మని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు.

కేజీ గుట్టలోనూ ఇదే సమస్య
మరోవైపు రొళ్ల మండలం కొడగార్ల గుట్ట (కేజీ గుట్ట) కాలనీకి వారం రోజులుగా నీటి సరఫరా బంద్‌ అయ్యింది. 10 రోజుల క్రితం వాటర్‌స్కీమ్‌ బోరుబావి వద్ద కేబుల్‌ వైరును గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించుకుపోవడంతో సమస్య తలెత్తింది. అప్పటినుంచి  సమస్య పరిష్కారానికి ఎవరూ చొరవ చూపలేదు. దీంతో ఆగ్రహించిన మహిళలు గురువారం రొళ్ల–మడకశిర జాతీయ రహదారి (544ఈ)పై ఖాళీ బిందెలు, మొద్దులు, రాళ్లు, ముళ్లకంపలు ఉంచి రాస్తారోకో చేపట్టారు. 

దీంతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎస్‌ఐ గౌతమి సిబ్బందితో వచ్చి మహిళలతో మాట్లాడారు. నీటి సమస్య తీర్చే వరకు కదలబోమని వారు తెగేసి చెప్పగా.. ఎస్‌ఐ సంబంధిత శాఖ అధికారులతో ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇప్పించారు. దీంతో మహిళలు అక్కడి నుంచి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని అధికారులకు సమస్యను వివరించారు. ఒక్క రోజులోనే సమస్య పరిష్కరిస్తామని డిప్యూటీ ఎంపీడీఓ సుధాకర్‌ హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)