Breaking News

డాబాపై డ్రాగన్‌ తోట

Published on Sun, 01/29/2023 - 05:59

రాజాం: ఆయనొక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. వ్యవసాయమంటే మక్కువ. కోవిడ్‌ సమయంలో ఖాళీగా ఉన్న సమయంలో తల్లిదండ్రుల సాయంతో విదేశాల్లో బాగా కలిసివస్తున్న డ్రాగన్‌ పంట సాగుపై దృష్టిసారించాడు. ఆ పంటకు ఇక్కడ ఉన్న డిమాండ్‌ గుర్తించాడు. వేసిన పంట ద్వారా ఫలసాయం పొందాలని భావించాడు. ఏకంగా తన ఇంటి డాబానే వ్యవసాయ క్షేత్రంగా మలిచాడు. వందకు పైగా మొక్కలు నాటాడు. సస్యరక్షణ చర్యలు చేపట్టాడు. డ్రాగన్‌ తోట ఏపుగా పెరిగి దిగుబడి ఆరంభం కావడంతో... కష్టం ఫలించిందంటూ సంబరపడుతున్నాడు. ఆయనే రాజాం పట్టణం పరిధిలోని డోలపేట గ్రామానికి చెందిన సుదర్శనం అధికారి.  

ఆరు సెంట్ల విస్తీర్ణంలో...  
సుదర్శనం అధికారి విశాఖపట్నంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయనకు చిన్న­ప్పటి నుంచి రకరకాల పంటలు సాగుచేయడమంటే ఇష్టం. తల్లిదండ్రులు నర్సమ్మ, శాంతిమూర్తిల ప్రోత్సాహంతో కొంత పొలాన్ని కొనుగోలుచేసి మామిడితోటలు, జీడితోటలతో పాటు పొలాలు, ఇంటి ఆవరణలో వివిధ రకాల మొక్కలు సాగు­చేస్తుంటాడు. అదే క్రమంలో కోవిడ్‌ సమయంలో ఇంటి డాబాపై డ్రాగన్‌ పంట సాగుకు పూనుకున్నా­డు.

25 స్తంభాలు ఏర్పాటుచేసి ఆరుసెంట్లు విస్తీర్ణంలో ఉన్న డాబాపై వందకుపైగా డ్రాగన్‌ మొక్క­లు 2020లో నాటాడు. గతేడాది జూలై నెలలో పూతకు వచ్చాయి. ఒక్కో మొక్కకు  12 నుంచి 15 వరకూ డ్రాగన్‌ పండ్లు దిగుబడి రావడంతో పాటు నాలుగు నెలలు పాటు పూత సాగింది. ఒక్కొక్కటి 800 గ్రాముల నుంచి 900 గ్రాముల బరువు ఉన్న పండ్లు దిగుబడి వస్తున్నాయి. పోషకాలు మెండుగా ఉన్న డ్రాగన్‌ పండ్ల కొనుగోలుకు ప్రస్తుతం అధికమంది ఆసక్తిచూపుతున్నారు.  

నిరంతరం ఇద్దరు..  
పొలం, ఇంటి వద్ద మొక్కల సంరక్షణకు ఇద్దరు రైతు కూలీలను నియమించాడు. ప్రతీ రెండు రో­జు­లకు డ్రాగన్‌ మొక్కలకు నీరు పెట్టడం, ఏపుగా పెరిగిన కొమ్మలు తొలగించడం, పేడ గత్తం, వేప ఆకులతో సేంద్రియ ఎరువు తయారుచేసి మొక్కలపై పిచికారీ చేయడం వంటి పనులను వారు చక్కబెడుతున్నారు. డ్రాగన్‌ తోట సాగుతో ఇల్లు కూడా చల్లగా ఉంటోందని ఆయన చెబుతున్నారు.  

అభిరుచితోనే...  
మా ఇంటిపై ఏవో మొక్కలు వేద్దామని అనుకున్నాను. కోవిడ్‌ సమయంలో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కావడంతో ఆలోచన వచ్చింది. నెట్‌లో చెక్‌చేసి డ్రాగన్‌ తోటలుపై దృష్టిసారించారు. ఖమ్మం నర్సరీతో పాటు రేగిడి మండలం కాగితాపల్లి వద్ద దూబ రమేష్‌ నర్సరీ నుంచి మొక్కలు తెచ్చాం. రూ.2 లక్షలు వెచ్చించి తోట వేశాం. ఇప్పుడు ఇవి అందంగా ఉండడంతో పాటు సీజన్‌లో మంచి పూత వస్తోంది. గతేడాది రూ.1.50 లక్షల వరకు ఆదాయం వచ్చింది.   
– సుదర్శనం అధికారి, డోలపేట 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)