Breaking News

సేంద్రియ బాటలో డ్రాగన్‌ సిరులు

Published on Sun, 06/22/2025 - 06:31

విభిన్నంగా ఆలోచించేవారు ఏ రంగంలోనైనా రాణిస్తారు. ధైర్యంగా చొరవతో అడుగేసేవారు విజయతీరానికి చేరుతారు. రసాయన ఎరువులకు స్వస్తి పలుకుతూ ప్రకృతి వ్యవసాయ బాటలో నడుస్తూ లాభాలు ఆర్జించవచ్చు. సేంద్రియ పద్ధతుల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ పండ్లు పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. ఎ.కోడూరుకు చెందిన రైతు లెక్కల కోటేశ్వరరావు.

కె.కోటపాడు: అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో ఐదెకరాల్లో డ్రాగన్‌ఫ్రూట్‌ సాగును రైతు కోటేశ్వరరావు మూడేళ్ల క్రితం ప్రారంభించారు. మొదటి ఏడాది సాగు ప్రారంభంలో దుక్కులు, డ్రాగన్‌ మొక్కల కొనుగోలు, సిమెంట్‌ స్తంభాలు, వైర్లుతో పాటు ఇతర కూలి ఖర్చులకు ఎకరానికి రూ.6 లక్షల నుంచి రూ.7లక్షల వరకూ ఖర్చు అవుతుంది. 8 నుంచి 12 నెలల మధ్య పంట చేతికొస్తుంది.

ప్రతి ఏడాది డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట దిగుబడి జూన్‌లో ప్రారంభమై నవంబర్‌ వరకూ ఉంటుంది. మొదటి ఏడాది 5 ఎకరాల్లోను 3 టన్నుల దిగుబడి, రెండో ఏడాది 15 టన్నుల దిగుబడి వచ్చిందని రైతు కోటేశ్వరరావు తెలిపారు. ఈ ఏడాది చెట్లకు డ్రాగన్‌ ఫ్రూట్‌ కాపు బాగుండడంతో 35 టన్నుల వరకూ దిగుబడి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

మొక్కలకు జీవామృతంతో ఊపిరి 
కోటేశ్వరరావు సేంద్రియ విధానంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ను సాగు చేస్తున్నారు. దీంతో మార్కెట్‌లో మంచి డిమాండ్, మద్దతు ధర పలుకుతోంది. ఆవు పేడ, కోడి గెత్తంను డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కల మొదళ్ల వద్ద వేయడంతో మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. గోమూత్రం, బెల్లం, శనగపిండి, ఆవు పేడ, పుట్టమన్నును వారం రోజుల పాటు నిల్వ ఉంచి తయారు చేసిన జీవామృతంను డ్రిప్‌ విధానం ద్వారా డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలకు అందిస్తున్నారు. తద్వారా పంటకు తెగుళ్ల బెడద తప్పింది. రసాయన ఎరువులకయ్యే ఖర్చు చాలా వరకు తగ్గింది.

స్థానికంగానే అమ్మకాలు 
డ్రాగన్‌ ఫ్రూట్‌ ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా దొరుకుతుంది. ఎక్కడ పండించినా పట్టణాలకు తెచ్చి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ఈ పంట ఎ.కోడూరులో సాగు చేయడంతో పాటు సేంద్రియ విధానంలో పండించడంతో కొనుగోలు చేసేందుకు స్థానిక ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ను తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలో మండలానికి చెందిన ప్రజలతో పాటు సమీప మండలాలైన దేవరాపల్లి, వేపాడకు చెందిన వారు వచ్చి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

ఆసక్తి ఉంటే సాగు సూచనలు 
డ్రాగన్‌ ఫ్రూట్‌ పంటను సేంద్రియ విధానంలో చేపడుతున్నా. సేంద్రియ ఎరువులు, జీవామృతం వాడడం వల్ల పంట దిగుబడి బాగుంది. పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు పొలం వద్దకే వస్తున్నారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట సాగుపై ఆసక్తి ఉన్న వారికి సలహాలు, సూచనలు చేస్తా. సాగు ప్రారంభంలో పెట్టుబడి ఖర్చులు ఎక్కువగా అయినా.. తదుపరి దిగుబడి ప్రారంభమైతే తరువాత ఏడాది నుంచి ఆదాయం పొందవచ్చును. కిలో డ్రాగన్‌ఫ్రూట్‌ రూ.150కు విక్రయిస్తున్నా. ఫోన్‌ నంబర్‌ 98663 81817లో సంప్రదిస్తే సాగుకు అవసరమైన సూచనలు చేస్తా. –లెక్కల కోటేశ్వరరావు, సాగు రైతు, ఎ.కోడూరు

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)