ఇంటింటికీ రేషన్‌ మూర్ఖపు నిర్ణయం

Published on Fri, 07/05/2024 - 05:10

సాక్షి, అమరావతి: ఇంటింటికీ రేషన్‌ పంపిణీ మూర్ఖపు నిర్ణయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. రేషన్‌ పంపిణీ చేసే మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్ల (ఎండీయూ) వల్ల పౌర సరఫరాల సంస్థకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. ఆయన గురువారం విజయవాడలోని పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పౌర సరఫరాల సంస్థకు రూ.1,500 కోట్లు నష్టం కలిగేలా 9,260 ఎండీయూ వాహనాలు కొన్నారని, ప్రతి నెలా ఒక్కో వాహనానికి రూ.27 వేలు వెచ్చిస్తున్నామని, ఇంతకన్నా అన్యాయం ఉండదని చెప్పారు. 

2027 వరకు వీటితో కాంట్రాక్టు కుదుర్చుకొని కార్పొరేషన్‌కు నష్టం కలిగించేలా మూర్ఖమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. రేషన్‌ డోర్‌ డెలివరీపై త్వరలో స్టేక్‌ హోల్డర్లతో విస్తృతంగా చర్చించి, నివేదిక రూపొందిస్తామని,  కేబినెట్‌లోనూ చర్చిస్తా­మని చెప్పారు. పౌర సరఫరాల సంస్థను రూ.36,300 కోట్ల అప్పుల పాలు చేశారన్నారు. రూ. 2 వేల కోట్ల బకాయిలు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకి ఇటీవలే చెల్లించామన్నారు. 

బియ్యం స్థానంలో నగదు పంపిణీపై విలేకరులు ప్రశ్నించగా.. ప్రభుత్వంలో అనేక ఆలోచనలు ఉన్నాయని, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ సూచనలతో ఉమ్మడి ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బియ్యం అక్రమ రవాణా జరిగిందని, కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకొని ఓ మాజీ ఎమ్మెల్యే  కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.  

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)