Breaking News

రామోజీ ఎందుకు ఓర్వలేకపోయారు?.. ఆ భయం వెంటాడిందా?

Published on Sun, 04/16/2023 - 08:12

రామోజీరావులో మరో కోణాన్ని ఆయన తోడల్లుడు డాల్ఫిన్‌ అప్పారావు బయటపెట్టారు. రామోజీ ఎందుకు ఓర్వలేకపోయారు? తన తోడల్లుడు ఎదిగిపోతానేమోననే భయం రామోజీని ఎందుకు వెంటాడింది? మార్గదర్శి డిపాజిట్లను ఎలా మళ్లించారు? రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఎందుకు హెచ్చరించింది? వంటి ఎన్నో విషయాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డాల్ఫిన్‌ అప్పారావు వెల్లడించారు.

అందుకే లీజు మాస్టర్లు అని పేరొచ్చింది..
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చిన్నగా ప్రారంభమైంది. ఆ తర్వాత రామోజీకి బ్రాంచ్‌లు విస్తరించాలన్న ఆలోచన వచ్చింది. విజయవాడ వచ్చినప్పుడు నన్ను పిలిచి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ విస్తరిస్తామని చెప్పారు. విజయవాడలో మొదటి బ్రాంచ్‌ ఏర్పాటు పనుల్ని రెండు మూడు నెలల్లోనే ప్రారంభించాం. ఆ తర్వాత విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, నెల్లూరు సహా 8 బ్రాంచ్‌లను వెంటనే మొదలుపెట్టాం. క్రమంగా చిట్స్‌ పెరిగాయి.

అప్పట్లో ఆ నగదును ఎటూ మళ్లించకపోవడంతో మార్గదర్శి బాగానే ఉంది. ఇంతలో ఈనాడు క్రమంగా విస్తరించి నంబర్‌వన్‌గా మారింది. ఆ తర్వాత డాల్ఫిన్‌ హోటల్‌పై దృష్టిసారించాం. ఆ బాధ్యతలు కూడా నేనే తీసుకొని.. అద్భుతంగా తీర్చిదిద్దాను. ఈనాడు, డాల్ఫిన్‌.. ఇలా అన్నింటిని లీజుకు తీసుకున్న స్థలాల్లోనే నడిపాం. అందుకే మాకు లీజు మాస్టర్లు అని పేరొచ్చింది. నన్ను చూసే ఆ స్థల యజమానులు లీజులకు ఇచ్చారు. దీన్ని కూడా రామోజీ ఓర్వలేకపోయారు. నేను ఎదిగిపోతానేమోననే భయం రామోజీని వెంటాడింది.

ఆర్‌బీఐ హెచ్చరించడంతో..
ఒక స్థాయి వరకూ డిపాజిట్లు తీసుకునేంత వరకూ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బాగానే ఉంది. ఈ డిపాజిట్లను మొదట ఈనాడు, డాల్ఫిన్‌ విస్తరణకు తరలించాం. ఎక్కడా ఇబ్బంది కలగకుండా.. లాభాలు రాగానే తిరిగి మళ్లీ మార్గ­దర్శిలోకి మళ్లించేవాళ్లం. అయితే.. సుప్రీంకోర్టు నిబంధనలను కఠినతరం చేసింది. ఆ సమయంలో ఒక సుప్రీంకోర్టు జడ్జి అభిప్రా­యాల్ని తీసుకున్నాం. దాని లూప్‌హోల్‌ని పసిగట్టిన రామోజీరావు మార్గదర్శి డిపాజిట్లను మళ్లించడం మళ్లీ మొదలు పెట్టారు.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) హెచ్చరించడంతో నిధుల మళ్లింపును నిలు­పుదల చేశారు. అయితే అప్పటికే రూ.వేల కోట్లు మళ్లించేశారు. ఈనాడు అప్పటికే అగ్రస్థానానికి చేరుకోవడంతో ఎవరూ అడ్డు చెప్పలేకపోయారు. ఆ సమయంలో ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ దీనిపై పోరాటం మొదలుపెట్టారు.
చదవండి: రామోజీ ఓ విషసర్పం.. తోడల్లుడు డాల్ఫిన్‌ అప్పారావు సంచలన వ్యాఖ్యలు

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)