Breaking News

డాక్‌ పే.. జిందాబాద్‌

Published on Sat, 06/15/2024 - 12:02

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): దేశంలో వినియోగ దారులకు సత్వర సేవలు అందించేందుకు తపాలాశాఖ వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఉత్తరాలు,  మనీ ఆర్డర్లు, కొరియర్, స్పీడ్‌ పోస్ట్‌తోపాటు బ్యాంకింగ్, గోల్డ్‌ బాండ్, బీమా తదితర సేవలను ప్రైవేటు సంస్థలకు దీటుగా దిగ్విజయంగా అందిస్తోంది. మరో అడుగు ముందుకేసి డిజిటల్‌ లావాదేవీల పెంపునకు గూగుల్‌ పే, ఫోన్‌ పే మాదిరిగా డాక్‌ పే అనే యాప్‌ను 2021లోనే దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు దీనిని ప్రజలకు చేరువ చేసే దిశగా దూసుకెళుతోంది. 

 ఈ డాక్‌ పే  ద్వారా ప్రజలు డిజిటల్‌ ఫైనాన్స్‌ సేవలు పొందడంతోపాటు ఇండియా పోస్టు, ఐపీపీబీ, అందించే బ్యాంకింగ్‌ సేవలు పొందవచ్చు. డబ్బు పంపడం, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం, డిజిటల్‌ రూపంలో వ్యాపారులకు నగదు చెల్లించడం లాంటి పనులను చక్కబెట్టుకోవచ్చు. ప్రతి భారతీయుడి అవసరాలను తీర్చేలా డాక్‌ పే యాప్‌ను రూపొందించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో యూపీఐ డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా దీనిని ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తున్నారు. ఈ యాప్‌ను ఏ బ్యాంకు ఖాతాదారుడైనా వినియోగించవచ్చు.  

గ్రీవెన్స్‌ వెసులుబాటు  
గూగుల్‌ పే, ఫోన్‌ పే నగదు లావాదేవీల్లో ఏవైనా పొరపాట్లు చోటుచేసుకుంటే ఫిర్యాదులు చేసేందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే వాటి కార్యాలయాలు మనకు అందుబాటులో ఉండవు. అయితే డాక్‌పే యాప్‌ ద్వారా నగదు బదిలీ సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే ఫిర్యాదుల స్వీకరణకు తపాలా శాఖ వెసులుబాటు కల్పించింది. డాక్‌ పే అనే యాప్‌ తపాలాశాఖ కేంద్ర ప్రభుత్వ ఆ«దీనంలోనే పనిచేస్తుండడంతో మన డబ్బుకు గ్యారెంటీ ఉంటుంది. యాప్‌ గురించిన సమగ్ర సమాచారం కోసం ఐపీపీబీ టోల్‌ఫ్రీ  నంబర్‌ 155299ను వినియోగదారులు  సంప్రదించొచ్చని తపాలా శాఖా అధికారులు చెబుతున్నారు.

 

#

Tags : 1

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)