Breaking News

అంతిమ యాత్రలో అపశ్రుతి.. రూ.5 లక్షలు నష్టం

Published on Wed, 08/21/2024 - 08:59

కురబలకోట: అంతిమ సంస్కారంలో భాగంగా పేల్చిన టపాసులు ఆ మార్గంలో పక్కనే ఉన్న టమాటా క్రేట్లపై పడటంతో అవి అంటుకుని కాలిపోయాయి. క్రేట్లను ఆనుకునే ఉన్న మరో రైతు భవనం ఎగిసిపడిన మంటలకు దెబ్బతింది. ఈ సంఘటనలో రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. స్థానికుల కథనం మేరకు..కురబలకోట మండలం అంగళ్లు గ్రామం మలిపెద్దివారిపల్లెకు చెందిన చిటికి తిప్పారెడ్డి రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. 

ఇతని అంత్యక్రియలు మంగళవారం ఉదయం నిర్వహించారు. ఆఖరి మజిలీ కావడంతో అంతిమ యాత్రను ఘనంగా ముగించాలన్న ఉద్దేశంతో పూలు చల్లుతూ టపాసులు పేలుస్తూ ముందుకు సాగారు. ఆ మార్గంలో పక్కనే ఉన్న టమాటా మండీల వద్ద మదనపల్లెకు చెందిన టమాటాల వ్యాపారి పీఏకె (పి. అహ్మద్‌ ఖాన్‌) ముందు రోజు రాత్రి లారీ లోడు టమాటా క్రేట్లు తోలాడు. పేలిన టపాసులు పక్కనే ఉన్న టమాటా క్రేట్లపై నిప్పురవ్వలు పడి అంటుకున్నాయి. ప్లాస్టిక్‌వి కావడంతో మంటలు ఎగిసి పడ్డాయి. మంటలకు అంగళ్లు, పరిసర ప్రాంతాల వారు కలవరపడ్డారు. 

అనంతరం మదనపల్లె పైర్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే క్రేట్లన్నీ కాలిపోయాయి. రూ. 3 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు చెబుతున్నారు. క్రేట్లు కాలడంతో వీటిని ఆనుకుని ఉన్న చిటికి హరినాథరెడ్డికి  చెందిన భవనం కూడా నల్లగా మారిపోయింది. ప్లాస్టింగ్, కిటీకీలు, గోడలు దెబ్బతిన్నాయి. ఇతని భవనానికి కూడా రూ.2 లక్షలకు పైగా నష్టం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. ఊహించని పరిణామం పట్ల విచారం వ్యక్తమవుతోంది.    


∙

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)